తాండూర్ : మండలంలోని బోయపల్లి భక్తఆంజనేయ స్వామి ఆలయంలో ఎక్కాహం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని (Krishnashtami celebrations) పురష్కరించుకుని 24 గంటల పాటు ఆలయ కమిటీ సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు భజన ( Bhajans ) నిర్వహించారు. శని, ఆదివారాలలో ద్వారకాపూర్, బోయపల్లి, తాండూర్, రేచీని, అచలాపూర్ గ్రామాలలో భజన కార్యక్రమం నిర్వహించారు.
తాండూర్లోని బ్రాహ్మణవాడ వెంకటేశ్వర ఆలయంలో ఒకరోజు భజన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో గంగాపూర్ వెంకటేశ్వర స్వామి విగ్రహాలను ఊరేగింపుగా తాండూర్‌కు తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమంలో చునార్కర్ కృష్ణ కృష్ణుని జన్మ వృత్తాంతాన్ని భజన రూపంలో వర్ణించారు. ఆదివారం విగ్రహాలను ఊరేగింపు పుట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, నాయకులు మాసాడి తిరుపతి , బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుబ్బదత్తు మూర్తి, మాజీ జడ్పీటీసీ బానయ్య , సీనియర్ నాయకులు దత్తాత్రేయ రావు, ఎలక రామచందర్, పెరిక రాజన్న, పోలీస్ అధికారి గోపాల్, వసంత్ వినోద్, శేఖర్, శ్రీనివాస్, పిట్టల వేణు పాల్గొన్నారు.