ఇచ్చోడ, జనవరి 11 : కాకతీయ యూనివర్సిటీ(కేయూ) పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు వారం రోజులుగా సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని వివేకానంద, చత్రపతి, సాయి సమథ్, కాకతీయ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ క్రమంలో ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. బుధవారం సాయి సమథ్ కళాశాలలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న 12 మంది విద్యార్థులను డిబార్ చేశారు. అనంతరం వివేకానంద కళాశాలలో తనిఖీలు నిర్వహించి తిరిగి వస్తున్న స్కాడ్ బృందం సభ్యులపై డిబార్ అయిన ఐదుగురు విద్యార్థులు దాడి చేసి కారు అద్దాలు పగులగొట్టారు. ఈ ఘటనపై బృందంలోని సభ్యుడు పూర్ణంచందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ ఉదయ్ కుమార్‌ను వివరణ అడుగగా.. ఫిర్యాదు చేసిన మాట వాస్తమే. రేపు విచారణ జరిపి పూర్తి వివరాలు తెలుపుతాం.