మంచిర్యాలటౌన్, మార్చి 29 : పట్టణ ప్రజలకు తాగు నీరందించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం అమృత్ (అటల్ మిషన్ ఫర్ రెజ్యుమనేషన్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) పథ కం ద్వారా నిధులు మంజూరు చేసింది. మం చిర్యాల జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు రూ. 237.88 కోట్లు ఇవ్వగా, ఆ మేరకు పట్టణాల్లో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సైతం యంత్రాంగం సిద్ధం చేసింది. 2048 సంవత్సరం దాకా సరిపడా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిధులతో పనులు చేపట్టనున్నది. ఇప్పటికే పట్టణాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తయి ఉండగా, వాటికి కొనసాగింపుగా ఈ పనులు చేపట్టేందు కు సన్నద్ధమవుతున్నది.
అవసరమైన పైపులైన్ల విస్తరణ, నీటి ట్యాంకులు, సంపులు, నీటిశుద్ధి కేంద్రాలు, ట్యాంకులకు ప్రహరీలు, సిబ్బంది క్వార్టర్లవంటి నిర్మాణాలు చేపట్టనున్నారు. కొత్తగా ఏర్పడిన కాలనీలు, ప్రాంతాల్లో కొత్త పైపులైన్ల విస్తరణ పనులు చేపట్టనున్నారు. కా గా, ఈ పథకంలో భాగం గా నీటి వినియోగపు వివరాల లెక్కలను పక్కాగా నమోదు చేయనున్నారు. స్కాడా సాఫ్ట్వేర్ ద్వారా నీటి ట్యాంకులకు వస్తున్న నీరు ఎంత, అక్కడి నుంచి ఏ ప్రాంతానికి ఎంతెంత నీరు వెళ్తున్నదో నమో దు చేస్తారు.
ప్రతీ ట్యాంకు దగ్గర ఫ్లో మీటర్లు ఏర్పాటు చేస్తారు. సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తమైన వివరాల ప్రకారం ఒక ప్రాంతానికి నీరు సరఫరా చేసే క్రమంలో ఆ ప్రాంతానికి ఎంత నీరు అవసరమో అంతేనీటిని ఆటోమేటిక్‌గా సరఫరా చేస్తారు. దీంతో నీటి వృథా తగ్గుతుంది. భవిష్యత్‌తో తాగునీటి నల్లాలకు మీటర్లు ఏర్పాటు చేసే అవకాశం కూడా లేకపోలేదు. వాడుకున్న నీటికి బిల్లు చెల్లించే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
మంచిర్యాల మున్సిపాలిటీ : అమృత్ నిధులతో సాయికుంటలో 600 కేఎల్ సామర్థ్యం కలిగిన నీటి ట్యాంకు, 21 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లు, 2.73 కిలో మీటర్ల మేర పాత పైపులైన్ల స్థానంలో కొత్త పైపులైన్ల ఏర్పాటు, కొత్తగా 6,,172 నల్లా కనెక్షన్లు ఇవ్వడంవంటి పనులు చేపట్టనున్నారు.
నస్పూర్ మున్సిపాలిటీ : 5.3 కిలోమీటర్ల మేర పంపింగ్ మెయిన్ లైన్లు, 8.3 కిలో మీటర్ల మేర ఫీడర్ మెయిన్ లైన్లు, 18 కిలోమీటర్ల మే ర డిస్ట్రిబ్యూషన్ లైన్లు విస్తరించనున్నారు. వె య్యి కేఎల్ సామర్థ్యం కలిగిన ట్యాంకులు రెం డు, 1800 కేఎల్ సామర్థ్యం కలిగిన ట్యాంకు ఒకటి, 1500 కేఎల్ సామర్థ్యం కలిగిన ట్యాం కులు రెండు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు నిర్మించనున్నారు. ఇక్కడ నీటి సరఫరాను ఏడు జోన్లుగా విభజించి చేపట్టనున్నారు. కొత్త గా 5,,040 నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు.
లక్షెటిపేట మున్సిపాలిటీ : 5.5 కిలోమీటర్ల మేర పంపింగ్ మెయిన్, 1.85 కిలోమీట్లర్ల ఫీడర్ మెయిన్, 11 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ లైన్లను విస్తరించనున్నారు. కొత్తగా 1200 కేఎల్, 600 కేఎల్ సామర్థ్యం కలిగిన నీటి ట్యాంకులను నిర్మించనున్నారు. కొత్తగా 1,273 నల్లా కనెక్షన్లను ఇవ్వనున్నారు.
చెన్నూరు మున్సిపాలిటీ : 6.7 కిలోమీటర్ల ఫీడర్ మెయిన్, 45 కిలో మీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ లైన్లు విస్తరించనున్నారు. ఇక్కడ 1400 కేఎల్ ట్యాంకు ఒకటి, 700 కేఎల్ సామర్థ్యం కలిగిన ట్యాంకు ఒకటి, 600 కేఎల్ సామర్థం కలిగిన ట్యాంకు ఒకటి కలిపి మొత్తం మూడు ట్యాంకులు నిర్మించనున్నారు. కొత్తగా 2,000 నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు.
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ : 1.11కిలోమీటర్ల ఫీడర్మెయిన్, 150 మీటర్ల పంపింగ్ మెయి న్, 55కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ లైన్లను నిర్మించనున్నారు. 1200 కేఎల్ సామర్థ్యం కలిగిన ట్యాంకు ఒకటి, 1000 కేఎల్ సామర్థ్యం కలిగిన ట్యాంకు ఒకటి, 600 కేఎల్ సామర్థ్యం కలిగిన సంప్ ఒకటి నిర్మించనున్నారు. కొత్తగా 5,130 నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు.
మందమర్రి మున్సిపాలిటీ : 12.2 కిలోమీటర్ల పంపింగ్ మెయిన్‌ను నిర్మించనున్నారు. అక్క డ కొత్తగా 1,456 నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నా రు. పైపులైన్ల విస్తరణ, ట్యాంకుల నిర్మాణం ఇప్పటికే మిషన్ భగీరథ పథకంలో నిర్మించిన నేపధ్యంలో పాత పైపులైన్లు చెడిపోయి ఉంటే వాటి స్థానంలో కొత్తవాటని ఏర్పాటుచేస్తారు.
బెల్లంపల్లి మున్సిపాలిటీ : పాతపైపులైన్ల స్థానంలో 25 కిలోమీటర్ల మేర కొత్త వాటిని ఏర్పాటు చేయనున్నారు. 200 మీటర్ల ఫీడర్ మెయిన్, ఎనిమిది కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్లైన్లు నిర్మించనున్నారు. ఫిల్టర్స్‌కు మరమ్మతులు చేపడుతారు. ఇక్కడ 500 కేఎల్ సామ ర్థ్యం కలిగిన నీటి ట్యాంకు నిర్మిస్తారు. కొత్తగా 1,456 నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు.
అమృత్ పథకం కింద అన్ని ప్రాంతాలకు తాగు నీరందించడమే లక్ష్యంగా త్వరలో పనులు ప్రారంభిస్తాం. నిర్మాణ సంస్థ అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయింది. వర్క్ ఆర్డరు రాగానే పనులు మొదలు పెడుతాం. ఇప్పటికే మంచిర్యాల, నస్పూర్ పట్టణాల్లో పనులకు శంకుస్థాపనలు పూర్తయ్యాయి. మెసరింగ్, రికార్డింగ్, కౌంటింగ్ పద్ధతిన నీటి వినియోగపు లెక్కలు రికార్డు చేస్తాం. పట్టణాల్లో కొత్తగా విస్తరిస్తున్న కాలనీలు, ఏరియాలను కవర్ చేస్తూ పైపులైన్ల విస్తరణ ఉంటుంది.
– శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ డీఈ, మంచిర్యాల