ఆసిఫాబాద్ టౌన్, మే 14 : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సకు గెలుపుకోసం నిరంతరం ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
తమకు బలమైన కార్యకర్తలు ఉన్నారని, మండే ఎండలను సైతం లెకచేయకుండా ప్రతి ఒకరూ ప్రచారంలో పాల్గొన్నారన్నారు. ఈ సమావేశంలో సింగల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి సలాం, నాయకులు భీమేశ్, రవి, సుగుణాకర్, అశోక్, బలరాం, తదితరులు పాల్గొన్నారు.