వాంకిడి, మార్చి 24: యువత, ప్రజలు మావోయిస్టులకు సహకరించి, భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య సూచించారు. మండలంలోని వెల్గి, లక్ష్మీపూర్ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతా ల్లో ఆదివారం ఉదయం వాంకిడి సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సాగర్, కేంద్ర బలగాలతో కలసి పర్యటించారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దని, అప్రమత్తంగా ఉం డాలని సూచించారు.
పోలీసులు అందుబాటులో ఉం టారని, ఎలాంటి సమస్య ఉన్నా సమాచారం అందించి పరిషరించుకోవాలని కోరారు. అపరిచిత వ్యక్తుల కదలికలపై సమాచారం అందించాలన్నారు. పంటలకు రక్షణగా అటవీ జంతువులను వేటాడేందుకు విద్యుత్తీగలను అమర్చవద్దని కోరారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు కావొద్దని సూచించారు. మండల కేంద్రంలోని ఖమాన అండర్ పాస్ బ్రిడ్జ్ నుంచి హనుమాన్ మందిర్ వీధుల్లో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు.