నిర్మల్ టౌన్, మార్చి 13 : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వచ్చిన అర్జీలను అదనపు కలెక్టర్ స్వీకరించారు. వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు అర్జీదారులకు భరోసానిచ్చారు. మొత్తం 19 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో లోకేశ్, ఆర్డీవో స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సమావేశమందిరంలో ప్రజావాణి
ఎదులాపురం, మార్చి 13 : ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, నటరాజ్ అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పింఛన్లు, వైద్యం, భూసంబంధిత, ఉపాధి, ధరణి, దళితబంధు, దళితబస్తీ, డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరు, తదితర సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ, ఆర్డీవో రాథోడ్ రమేశ్, డీఆర్డీఏ కిషన్, జడ్పీ సీఈవో గణపతి, మున్సిపల్ కమిషనర్ శైలజ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.