నస్పూర్, జూలై 27 : ఆకస్మిక మరణాలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌కలాం వర్ధంతి సందర్భంగా ప్రపంచ సీపీఆర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పునర్జన్మ కార్యక్రమంలో భాగంగా శనివారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్ర జాప్రతినిధులు, అధికారులు, మీడియాప్రతినిధులకు సీపీఆర్‌పై అవగాహన నిర్వహించారు. డీఎంహెచ్‌వో అనితతో కలిసి సీపీఆర్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్‌నాయక్, ప్రోగ్రాం అధికారి కృపామయి, జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, సీడీపీవోలు, సూపర్ వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్త్రీ, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య, బాలల సంరక్షణ అధికారి ఆనంద్‌తో కలిసి సీడీపీవోలు, సూపర్ వైజర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. సఖీ కేంద్రం పోస్టర్లను విడుదల చేశారు.
సర్కారు బడుల్లో గుణాత్మక విద్య
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలతో కూడిన గుణాత్మక విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ మేరకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో డీఈవో యాదయ్యతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం పురోగతిపై సమీక్షించారు.