Anganwadi Services | అంగన్వాడీల సేవలు వెలకట్టలేనివి : జిల్లా సంక్షేమాధికారి రవూఫ్ ఖాన్
Anganwadi Services | గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్‌గా, ఆయాలుగా, పలు ఉద్యోగులుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన వారి సేవలు వెలకట్టలేమని జిల్లా సంక్షేమాధికారి రవూఫ్‌ఖాన్ అన్నారు.
తాండూర్ : గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ( Anganwadi ) టీచర్‌గా, ఆయాలుగా, పలు ఉద్యోగులుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన వారి సేవలు వెలకట్టలేమని జిల్లా
సంక్షేమాధికారి రవూఫ్‌ఖాన్ ( Raouf Khan) అన్నారు. శుక్రవారం మండలంలోని రేచిని రైతు వేదికలో తాండూర్ సెక్టార్ పరిధిలో ఉద్యోగ విరమణ పొందిన అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అచ్చలాపూర్- 7 అంగన్వాడీ టీచర్ అప్పాల రాధ, పలు ఆంగన్ వాడీ కేంద్రాల ఆయాలు అంకుబాయి, నానక్క బీమక్క, పుల్లమ్మ, లక్ష్మి, రాజుబాయి, మల్లుబాయి లకు బెల్లంపల్లి సీడీపీవో స్వరూపారాణి, అధికారులు, సిబ్బంది పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి తొలి పాఠశాల అంగన్వాడీ కేంద్రమే అన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో విద్య అభ్యసించిన తనతో పాటు ఎంతోమంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. అనంతరం అన్నప్రాసన, అక్షరభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతురాజుల రాంబాయి, ఐసీడీఎఎస్ సూపర్వైజర్ స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

