ఎదులాపురం, మార్చి 10 : ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. ఈ సమావేశంలో ఏజెండాలోని అంశాలను చర్చించకుండానే చైర్ పర్సన్ అనూష వెళ్లిపోయారు. దీంతో కౌన్సిలర్లు చైర్ పర్సన్ చాంబర్ ఎదుట ఆందోళన చేపట్టారు. నీటి సమస్యలపై చర్చించకుండా తమకు అవకాశం ఇవ్వలేదని ఖాళీ బిందెలతో భైఠాయించారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ సీఐ సునీల్‌కుమార్, ఎస్సైలు అశోక్, నాగానాథ్లు అకడి చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు పాయల శరత్ అకడి చేరుకొని కమిషనర్ రాజును నిలదీయడంతో పోలీసులు ఆయనను నిలువరించారు. దీంతో పోలీసులు, పాయల శరత్ మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కొంత తొపులాట జరిగింది. అనంతరం డీఎస్పీ జీవన్‌రెడ్డి అకడి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
రెండున్నరేండ్లుగా బీజేపీ ఎమ్మెల్యే అధికారంలో ఉండి ఏం చేశారో కౌన్సిలర్లు చెప్పాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష డిమాండ్ చేశారు. కౌ న్సిల్ సమావేశం 11 గంటలు అని మూడు రోజుల ముందే ప్రకటించామన్నారు. తాము 15 నిమిషాల ముందుగానే వచ్చినట్టు తెలిపారు. బీజేపీ కౌన్సిలర్లు ఆలస్యంగా వచ్చారన్నారు. ఎమ్మెల్యే హాజరు కావడంతో ఆయనకు 45 నిమిషాలు కేటాయించామన్నారు. అయి బీజేపీ నాయకులు గొడవ చేయాలనే ఆలోచనతోనే నిరసన తెలుపుతున్నారని ఆరోపించారు. మహిళ అని చూడకుండా రౌడీయిజం చేస్తున్నారన్నారు.
ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం ఉంటుందని ఎ మ్మెల్యే పాయల శంకర్ అన్నారు. తొలి మున్సిపల్ సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ అనూష అధ్యక్షతన నిర్వహించగా.. ఎమ్మెల్యే ఎక్స్ ఆఫీషియో హో దాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలు.. పట్టణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు పాల్గొన్నారు.