ఆదిలాబాద్, జూలై 20 ( నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలో ఎన్టీటీ డాటా బేస్ సొల్యూషన్స్ ఐటీ పరిశ్రమను గురువారం ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహాయ, సహకారాలతో ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ రంగం విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతమున్న బీడీఎన్టీ ఐటీ పరిశ్రమలో వంద మంది యువత ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారన్నారు.
ప్రభుత్వం కొత్తగా రూ.40 కోట్లతో బట్టిసావర్గాంలో మూడెకరాల్లో ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నదని తెలిపారు. 14 నెల ల్లో పనులు పూర్తవుతాయని, పలు కంపెనీలు ఇందులో తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశాలున్నాయన్నారు. ఐటీ టవర్ నిర్మాణం ద్వారా జిల్లాలోని 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. గతంలో జిల్లాకు చెందిన నిరుద్యోగులు ఐటీ ఉద్యోగాలు చేయడానికి హైదరాబాద్, బెంగళూర్, పుణె లాంటి పట్టణాలకు పోయే వారని, ఇప్పుడు సొంత జిల్లాలోనే ఉద్యోగాలు చేసే అవకాశం ల భించినట్లు చెప్పారు. ఆదిలాబాద్‌కు చెందిన సం జయ్ దేశ్‌పాండే ఆదిలాబాద్‌లో ఐటీ పరిశ్రమ ను స్థాపించడానికి ముందుకు రావడం సంతోషకరమన్నారు. జిల్లాలో కొత్తగా ప్రారంభం కా నున్న ఎన్టీటీ డాటా బేస్ సొల్యూషన్స్ కంపెనీలో 150 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపా రు. కార్యక్రమంలో ఎన్టీటీ డాటా బేస్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ దేశ్‌పాండే, కంపెనీ ప్రతినిధులు కల్పన, శ్రీనివాస్, బీఆర్ఎస్ యువ నాయకుడు జోగు ప్రేమేందర్, ఇమ్రాన్ ఉన్నారు.