దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్(మధుమేహం)తో బాధపడే వారికి సర్కారు తీపి కబురు అందించింది. శ్రమ, ఆర్థికభారం తగ్గించేందుకు మందులు ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా నాన్ కమ్యూనబుల్ డిసీజెస్(ఎన్సీడీ) కిట్ల పంపిణీని శుక్రవారం అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కాగా.. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 16 పీహెచ్‌సీలు, 3 యూపీహెచ్సీల పరిధిలో బీపీ ఉన్నవారు 39,867 మంది, షుగర్ వ్యాధిగ్రస్తులు 15,965 మంది ఉన్నారు. వీరందరికీ దశలవారీగా నెలకు సరిపడా ఎన్సీడీ కిట్ల రూపంలో మందులు అందించనున్నారు. కేసీఆర్ కిట్ మాదిరిగా మెడికల్ కిట్‌పై ‘ఉన్నతమైన జీవనానికి ఆరోగ్యకరమైన అలవాట్లు’ అనే నినాదాన్ని ఆకర్షణీయంగా ముద్రించారు.
నిర్మల్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీపీ, షుగర్, వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి దవాఖానల చుట్టూ తిరిగే శ్రమ, ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రత్యేకంగా మందుల కిట్లను పంపిణీ చేస్తున్నది. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా నాన్ కమ్యూనబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కిట్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు.
వీ టిని జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి బాధితులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్న వారి ని గుర్తించేందుకు 16 పీహెచ్‌సీలు, 3 యూపీహెచ్సీల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటా వైద్య ప రీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 39, 867 మంది బీపీతో, 15,965 మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరందరికీ దశలవారీగా ఎన్సీడీ కిట్ల రూపంలో షుగర్, బీపీని నియంత్రించే మందులను అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
గర్భిణులకు ప్రసవ సమయంలో ఇచ్చే కేసీఆర్ కిట్ మాదిరిగా జిల్లాలో బీపీ, షుగర్ వంటి అసంక్రమిత వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారికి ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సిబ్బంది నాన్ కమ్యూనబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కిట్లను అందజేయనున్నారు. కేసీఆర్ కిట్ మాదిరిగా ఆకర్షణీయంగా డిజైన్ చేసిన ఈ మెడికల్ కిట్‌పై ‘ఉన్నతమైన జీవనానికి ఆరోగ్యకరమైన అలవాట్లు’ అనే నినాదాన్ని ముద్రించారు. ఇందులో ప్రతి రోజూ ఉపయోగించే మందులతోపాటు సమాచార పత్రాలు ఉంటాయి. వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించేలా వారి ఆహారపు అలవాట్లు, యోగా, వ్యాయామం తదితర విషయాలను వివరిస్తారు. అలాగే ఈ వ్యాధులతో కలిగే దుష్పరిణామాల గురించి సవివరంగా తెలిపేలా రూపొందించిన కరపత్రాలను మందులతో పాటు అందజేస్తారు. ఈ కిట్‌లో ఉదయం, మద్యాహ్నం, రాత్రి వేళల్లో వేసుకునేలా నెలకు సరిపడా మందులను పంపిణీ చేస్తున్నారు. అందుకోసం మూడు రంగులతో కూడిన మూడు బ్యాగుల్లో మందులు ఉంటాయి.
స్థానికంగా ఉండే ఏఎన్ఎంలు రోగుల ఇంటికి వెళ్లి కిట్ అందిస్తున్నారు. నిరక్ష్యరాస్యులు మందులను సక్రమంగా వేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. కాగా, వ్యాధులను నియంత్రించేందుకు క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని నిర్మల్ డీఎంహెచ్‌వో ధన్‌రాజ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇంటింటా సర్వే చేసి, హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసినట్లు చెప్పా రు. దాని ప్రకారం వ్యాధి గ్రస్తులందరి ఇంటికి వెళ్లి సక్రమంగా మందుల కిట్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వైద్యులు సూ చించిన సమయానికి మందులు వేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రోగులకు తెలిపా రు. అలాగే ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ప్రతిరోజూ వ్యాయామం, మార్నింగ్ వాక్ అలవాటు చేసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.