భైంసా, అక్టోబర్ 19 : తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాలను పెంచేలా ఉపాధ్యాయులు పనిచేయాలని ఆర్జేడీ సత్యనారాయణ సూచించారు. పట్టణంలోని పిప్రి ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని, ప్రతి విద్యార్థికీ చదవడం, రాయ డం, గుణితాలు, సృజనాత్మకత నేర్పించేందుకు తొలిమెట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు, రికార్డులను తనిఖీ చేశారు. ఈయన వెంట ఎంఈవో సుభాష్, ఎస్వో నర్సయ్య, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రమణారావు, పీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
వానల్పాడ్, దేగాం పాఠశాలల సందర్శన
భైంసాటౌన్, అక్టోబర్ 19 : మండలంలోని వానల్పాడ్, దేగాం ప్రాథమిక పాఠశాలలను ఆర్జేడీ సత్యనారాయణ సందర్శించారు. పరిశీలనలో భాగంగా మౌళిక భాషా, గణిత సామర్థ్యాల సాధన ప్రగతి రికార్డుల ఆధారంగా పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా చదివించడం, నల్లబల్లపై గణిత సామర్థ్యాలను చేయించారు. పాఠశాలల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంఈవో సుభాష్, హెచ్ఎం గోపాల్, ఏఎంవో నర్సయ్య, ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి, రజిని తదితరులున్నారు.