నిర్మల్ అర్బన్, అక్టోబర్ 7 : టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందడంతో దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌కు ప్రజాదరణ పెరుగుతు న్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొ న్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో నర్సాపూర్ (జీ) మం డలానికి చెందిన 150 మంది కాంగ్రెస్ నాయ కులు శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ను పక్క రాష్ర్టాల్లో అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో పేదలను దృష్టిలో ఉంచుకుని దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ఇక్కడ అమలు చేస్తున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రజాదరణ, ఆయన చేస్తున్న అభివృద్ధ్దిని చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ బలహీన పడుతున్నదని, కేంద్ర ప్రభు త్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేస్తున్నదని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ వేల కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటే కేంద్ర ప్రభు త్వం తెలంగాణకు చిల్లి గవ్వ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. మునుగోడులో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. జాతీయ రాజకీ యా ల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి పాలాభిషేకం చేశారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, సుభాష్ రావు, కౌన్సిలర్లు, నాయకులు గంగాధర్, సుబ్బయ్య, సాజిద్, ప్రవీణ్, రాజేందర్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.