దిలావర్పూర్ అక్టోబర్ 7 : మండలంలోని సిర్గాపూర్ గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ రాజ్య సభ సభ్యుడు నిరంజన్‌రెడ్డి శుక్రవారం దిలావర్ పూర్ తహసీల్ కార్యాలయానికి తన వ్యక్తిగత పనుల్లో భాగంగా వచ్చారు. అంతకు ముందు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల నాయకులు, తహసీల్దార్, కార్యాలయ సిబ్బంది బొకే ఇచ్చి స్వాగతం పలికారు.
శాలువా, పూలమాలతో సన్మానించారు. అనంతరం భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొని వెళ్లారు. తహసీల్దార్ కరీం, ఆర్ఐ సంతోష్ కుమార్, ఏవో స్రవంతి, నాయకులు పాల్దె అనిల్, దనే రవి, సప్పల రవి, కుంట గంగాధర్, గంగారెడ్డి, తక్కల కిషన్‌రెడ్డి, తహసీల్, ఎంపీడీవో కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.