బోథ్/గుడిహత్నూర్/ఇచ్చోడ, సెప్టెంబర్ 19: గిరిజన బంధు, రిజర్వేషన్ల పెంపు ప్రకటనపై ఆదివాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతోనే సాధ్యమని ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆయా చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు సోమవారం పాలాభిషేకం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, కోటపల్లి మండలంలోని ఎసన్వాయి, సర్వాయిపేట, భీమారం మండలంలోని లంబాడీ తండా, ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, గుడిహత్నూర్, ఇచ్చోడ మండలాల్లోనూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. రాజధానిలో ప్రత్యేక భవన్లను ప్రారంభించి, తమ ఆత్మగౌరవాన్ని నిలిపారని స్పష్టం చేశారు.
గిరిజన బంధు అందిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆరే తమకు అసలైన బంధువని గిరిజనులు అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్ల పెంపుతో పాటు ప్రత్యేక పథకం అమలు చేస్తామని ప్రకటించ డాన్ని హర్షిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సోమ వారం సంబురాలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం, కోటపల్లి మండలంలోని ఎసన్వాయి, సర్వా యిపేట, భీమారం మండలంలోని లంబాడీ తండా లో ఆదివాసీ, బంజారా నాయకులు ఈ మేరకు సంబురాలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా లోని బోథ్, గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లోనూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజ ధానిలో ఆదివాసీ, బంజారా భవన్లు నిర్మించి, తమ మరింత గౌరవం కల్పించారని కొనియా డారు.