కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు జిల్లాలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, అధికారులు, ప్రజలు జైల్ చౌరస్తా నుంచి పీటీజీ కొలాం పాఠశాలకు వరకు భారీ ర్యాలీ తీశారు. జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ సురేశ్ కుమార్ పా ల్గొన్నారు. వేడుకలకు వచ్చిన వారి కోసం భోజన వసతి కల్పించారు. కలెక్టర్, ఎస్పీ విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. అలాగే కాగజ్‌నగర్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పూల మాలలు వేసి ర్యాలీ నిర్వహించారు.
మార్కెట్ కమిటీ కార్యాలయం నుంచి ఎస్పీఎం గ్రౌండ్ వరకు ర్యాలీ తీశారు. అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఏఎస్పీ అచ్చేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఎస్పీఎం క్రీడా మైదానంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి మాట్లాడుతూ భారతదేశంలో తెలంగాణ విలీనమైన రోజును గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం మూడు రోజుల పాటు తెలంగాణ జా తీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నదన్నారు. వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే హైదరాబాద్‌లో నిర్మించిన ఆదివాసీ భవన్, బంజార భవనాలను శనివారం సీఎం ప్రారంభించనున్నారని, జిల్లా నుంచి సుమారు 5 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తోందన్నారు. జిల్లాలో విద్య, వైద్యపరంగా ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.
కాగజ్‌నగర్, సెప్టెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నదని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. పట్టణంలోని మార్కెట్ కమిటీ నుంచి జేకే పేపర్ మి ల్లు క్రీడా మైదానం వరకు భారీ ర్యాలీ తీశారు.అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ ర్యాలీ విజయవంతానికి సహకరించి విద్యార్థులకు స్నాక్స్, తాగునీటి సౌకర్యం కల్పించిన వివిధ సంఘాలు, ఎన్జీవోల ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు అధికారులు, విద్యార్థులు జాతీయ గీతాలాపన చేశారు. రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బిస్కె ట్స్, నీటి వసతి కల్పించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, అదనపు ఎస్పీ అచ్చేశ్వర్రావు, డీఆర్డీవో సురేందర్, డీఎస్పీ కరుణాకర్, సీఐ రవీందర్, మున్సిపల్ చై ర్మన్ సద్దాం హుస్సేన్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, తహసీల్దార్లు ప్రమోద్‌కుమార్, రాంమోహన్, మార్కెట్ కమిటీ చై ర్మన్ కాసం శ్రీనివాస్, ఎంఈవో భిక్షపతి, కాగజ్‌నగర్ మండల వైస్ ఎంపీపీ స్వదేశ్ శర్మ, బెజ్జూర్ జడ్పీటీసీ పుష్పలత, కౌటాల ఎంపీపీ విశ్వనాథ్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాకీర్ షరీఫ్, కౌన్సిలర్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌టౌన్,సెప్టెంబర్ 16: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కాగజ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పా య్ ర్యాలీని ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు, ఆయాశాఖల అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పెంచికల్పేట్,సెప్టెంబర్ 16: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా తహసీల్దార్ అనంతరాజు ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. ఏఎస్ఐ గంగారాం, ఆర్ఐ గోపాల్, ఎం పీటీసీ రాజన్న, పీఈటీ శ్రీధర్, ఎస్వో కవిత, నాయకులు శ్రీనివాస్, తిరుపతి, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.