కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజధానిలో అడవిబిడ్డల ఆత్మగౌరవం ఉట్టిపడేలా నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను సీఎం కేసీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 17న ప్రారంభించనున్నారు. ఈ వేడుకలకు జిల్లా నుంచి 5 వేల మంది గిరిజనులను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 లో రూ. 24. 68 లక్షలతో ఆదివాసీ భవన్, రూ. 24. 43 లక్షలతో ఆదివాసీ, బంజారాలా సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబించేలా భవనాలను నిర్మించారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రత్యేకంగా భవనాలను మంజూరు చేసింది. అభివృద్ధితోపాటు సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ, బంజారా భవనాలను వారి ఆచారాలకు అనుగుణంగా నిర్మించింది. ఆదివాసీ భవన్లో ఆదివాసీ తెగలకు చెందిన గోండు, కోయ, తోటి, పర్థాన్, నాయక్‌పోడ్, చెంచు తదితర 10 తెగలకు చెందిన కళాకృతులతోపాటు, బంజారా భవన్లో లంబాడీల జీవన విధానాలు, సంస్కృతిని తెలిపేలా కళాకృతులను ఏర్పాటు చేశారు.
ఆదివాసీలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఆచార సాంప్రదాయాలకు మంచి గౌరవ కల్పిస్తోంది. రాష్ట్ర రాజధానిలో ఆదివాసీ భవన్ నిర్మించి ఆదివాసీల ఆత్మగౌరవాన్ని మరింత పెం చింది. ప్రత్యేక రాష్ట్రంలోనే పోరాట వీరుడు కుమ్రం భీంకు గతంలో ఎన్నడు లేనంతగా గుర్తింపుని తీసుకువచ్చింది సీఎం కేసీఆర్ సారే. రూ. 25 కోట్లతో జోడెఘాట్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేశారు.
– కనక యాదవ్‌రావు, రాయిసెంటర్ల జిల్లా గౌరవ అధ్యక్షుడు
ఆదివాసీలకు తెలంగాణ ప్రభుత్వం నిజమైన గుర్తింపుని ఇ స్తోం ది. గత పాలకుల పట్టించుకునే వారు కాదు. తెలంగాణ రా ష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జోడెఘాట్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ ఆదివాసీల అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెట్టారు. అలాగే హైదరాబాద్‌లో ఆదివాసీ భవనాన్ని నిర్మించడం ఎంతో గొప్ప విషయం. ఈ భవ నం ఆదివాసీలకు రాజధానిలో ఒక కేం ద్రం లాంటింది. రాష్ట్రస్థాయి సమావేశాలు, సంఘటిత కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు భవనం ఎంతోగానో ఉపయోగపడుతుంది. ప్రపంచానికి ఆదివాసీల సంస్కృతి గురించి తెలుస్తుంది.
– కుమ్రం తిరుమల, ఆసిఫాబాద్ మహిళా నేత, జైనూర్ ఎంపీపీ
హైదరాబాద్‌లో బంజారాల కోసం ప్ర త్యేకంగా భవనాన్ని నిర్మించిన తెలంగా ణ ప్రభుత్వానికి బంజారా సమాజం రుణపడి ఉంటుంది. బంజారాహిల్స్ ఇంతకాలం పేరుగా మాత్ర మే ఉండే ది. ఇప్పుడు ఈ ప్రాంతంలో బంజారా భవన్‌ను ప్రభుత్వం నిర్మించడంతో ఈ ప్రాంతానికి సరైన గుర్తింపు లభించింది. గతంలో ఏ ప్రభుత్వా లు కూడా ఇంత గుర్తింపును ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ మాత్ర మే బంజారాలకు గుర్తింపు నిచ్చారు. బంజారాల ఆచారాలు, సంస్కృతి భావితరాలకు తెలిసేలా భవనాన్ని నిర్మించారు.
– ఆత్మారాం నాయక్, బంజారా సంఘం నాయకుడు, వైస్ ఎంపీపీ లింగాపూర్