ఎదులాపురం,సెప్టెంబర్ 13 : సాఫ్ట్వేర్ రంగం లో ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకో వాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థు లకు హెచ్‌సీఎల్ టెక్ బీ సంస్థ వారు ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకో వాలన్నారు. 2021-22 సంవత్సరంలో ఇంటర్ మాథమెటిక్స్ విభాగంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ జాబ్ మేళాకు అర్హులని, హెచ్ సీఎల్ సంస్థ దేశవ్యాప్తంగా ఉద్యోగ మేళా నిర్వహి స్తున్నదని తెలిపారు. సాఫ్ట్ వేర్ రంగంలో మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నతావకాశాలు సంపాదించుకోవాలని పేర్కొ న్నారు. ఎంపికైన అభ్యర్థులకు అర్హతను బట్టి వేతనం చెల్లిస్తారని పేర్కొన్నారు. డీఐఈవో రవీందర్ కుమార్, హెచ్‌సీఎల్ ప్రతినిధులు, ఆర్సీవో తదితరులు పాల్గొన్నారు.