ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 12 : కేంద్ర బృందం సభ్యులు టీబీపై ఆరా తీశారు. జిల్లాలోని పలు పీహెచ్‌సీలను అనురాధ, అభిజిత్, హార్ధిక్ సోమవారం సందర్శించారు. ఇం ద్రవెల్లిలో క్షయవ్యాధి బాధితుల వివరాలు నమోదు చే సుకున్నారు. పీహెచ్‌సీలోని రికార్డులను పరిశీలించారు. క్షయవ్యాధి ఉన్న రోగి నుంచి సేకరించిన నమూనాను మైక్రోస్కాప్ ద్వారా పరిశీలించారు. స్టోర్‌రూంలో నిల్వ ఉంచిన వివిధ రకాల మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో వైద్యులతోపాటు సిబ్బంది పర్యటించి క్షయ వ్యాధిగ్రస్తులకు మె రుగైన వైద్యం అందించాలని సూచించారు. గ్రామాల్లో గుర్తించిన సదరు రోగికు చెందిన పూర్తి వివరాలు నమో దు చేయాలన్నారు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు క్షయపై పూర్తి వివరించాలని తెలిపారు. వైద్యుడు శ్రీకాంత్, హెల్త్‌సూపర్‌వైజర్ జాదవ్ శ్రీనివాస్, మైక్రోబయాలజిస్ట్ ప్రమోద్, ఎస్టీఎస్ వెంకటేశ్వర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, సెప్టెంబర్ 12 : క్షయవ్యాధి(టీబీ) బాధితులకు అందించే సేవలు బాగు ఉన్నాయని కేంద్రీయ బృందం ప్రతినిధి డాక్టర్ ఈశ్వర్‌రాజ్ అన్నారు. నార్నూ ర్, గాదిగూడ మండలాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. పీహెచ్సీ పరిధిలో ని వైద్య సిబ్బందితో కలిసి క్షయవ్యాధి బాధితుల వద్దకు వెళ్లారు. సిబ్బంది అందించే వైద్యం తీరును అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ బృందం ప్రతినిధులు డాక్టర్ కిరణ్, వెంకటేశ్, హెచ్‌ఈవో చౌహాన్ నాందేవ్, ఆరోగ్య పర్యవేక్షుడు చౌహాన్ చరణ్‌దాస్, సత్యవ్వ, హెల్త్ అసిస్టెంట్ ఈశ్వర్, వైద్య సిబ్బంది తదితరులున్నారు.
ఆదిలాబాద్ టౌన్, సెప్టెంబర్ 12 : జిల్లాలో టీబీ వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలపై ఢిల్లీ టీబీ బృందం సభ్యులు పలు పీహెచ్‌సీలను సందర్శించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి పీహెచ్‌సీని బృందం సభ్యులు పరిశీలించారు. టీబీ వ్యాధిగ్రస్తుల వివరాలపై వైద్యులను అడిగి ఆరాతీశారు. రికార్డులను పరిశీలించారు. ఐదుగురు టీబీ వ్యాధిగ్రస్తులతో మాట్లాడారు. 2025 నాటికి టీబీ రహిత దేశంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. బృందం సభ్యులు డాక్టర్ డీ రాజేశ్, డాక్టర్ సుమలత, డాక్టర్ ఉష్మ, అంకోలి పీహెచ్సీ డాక్టర్ రాహుల్, సిబ్బంది తదితరులున్నారు.
బోథ్, సెప్టెంబర్ 12: బోథ్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన జేఎస్ఎస్ఎం బృందం సభ్యులు డాక్టర్ రవీందర్, డాక్టర్ శ్రీఘన, డాక్టర్ రవీందర్ సందర్శించారు. టీబీ వ్యాధిగ్రస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. దవాఖానలోని ట్రూనాట్ మిషన్‌ను పరిశీలించారు. వ్యాధిగ్రస్తులు, కోలుకున్న వారి వివరాలు సేకరించారు. అనంతరం నలుగురు వ్యాధిగ్రస్తుల వద్దకు వెళ్లారు. వైద్య సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట ఎస్పీఎస్ సుధ, ఎస్పీఎల్ఎస్ దేవిదాస్, సూపర్ వైజర్లు నర్సింహస్వామి, జాహెదా, ల్యాబ్ టెక్నీషియన్ పరమేశ్వర్, ఆశ కార్యకర్తలు తదితరులున్నారు.