నిర్మల్అర్బన్, సెప్టెంబర్ 10 : విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయడానికి, విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెంచడానికి ఇన్స్పైర్ మేళా నిర్వహిస్తున్నామని నిర్మల్ డీఈవో రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో శనివారం ఇన్స్పైర్ ఆన్లైన్ నామినేషన్ సెంటర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాల నుంచి 5 చొప్పున నామినేషన్లను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు.
గత ఏడాది నిర్మల్ జిల్లా 186 ప్రాజెక్టులతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ నెల 25వ తేదీలోపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తమ నామినేషన్లను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్‌లైన్ సెంటర్లను సంప్రదించాలని సూచించారు. ఈ సంవత్సరం ఇన్‌స్పైర్‌లో రాష్ట్రంలో ప్రథమ స్థానం నిలవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి వినోద్‌కుమార్, నారాయణ వర్మ, మనోహర్ రెడ్డి, సుదర్శన్, ఇంతియాజ్, అన్సార్ పాల్గొన్నారు.