హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు జోగు రామన్న, విఠల్‌రెడ్డి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నిర్మల్,సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ లాంటి సమర్థ నాయకుడు దేశానికి అవసరం. ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని దేశ ప్రజలందరూ కోరుకుంటు న్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇవి దేశ వ్యాప్తంగా అమలు కావాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిందేనని వారంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి దేశంలోని అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. ప్రస్తుతం సీఎం కేసీఆరే దేశానికి దిక్సూచిలా కనిపిస్తున్నారు. మన పథకాలు దేశవ్యాప్తంగా అమలైతే మార్పు ఖాయమవుతుంది.
-మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్,సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో అమలైతేనే బడుగు, బలహీన వర్గాల బతుకులు బాగుపడుతాయి. గడిచిన ఎనిమిదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ వర్గానికి కూడా ఎలాంటి సహాయం అందించలేదు. కేవలం సంపన్న వర్గాలకే మేలు జరిగింది. ప్రతి రాష్ర్టానికి చెందిన రైతు నాయకులు, మేథావులు ఇక్కడికి వచ్చి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను చూసి నివ్వెరపోయారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమల్లోకి రావాల్సిన అవసరం ఉంది. అందుకే యావత్ భారతదేశం ఇప్పుడు కేసీఆర్ పథకాలకోసం ఎదురు చూస్తున్నది. ఇందుకోసం అవసరమైన దేశ నాయకత్వాన్ని కేసీఆర్ తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు.
-విఠల్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకోవడం సంతోషకరం. కేంద్రంలో బీజేపీ పాలన అస్తవ్యస్తంగా మారి పేదలు, రైతులు, కార్మికులు, ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు దేశానికి నాయకత్వం వహించడం ఎంతో అవసరం. ఉద్యమ నాయకుడిగా ప్రజల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీరు, విద్యుత్, ఇతర రంగాల్లో ఎంతో అభివృద్ధి చేసిన నాయ కుడు కేసీఆర్. దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే అవకా శాలున్నాయి. రాష్ట్రంలో ఐదేళ్లలో మార్పు తీసుకువచ్చిన ఆయన దేశాన్ని సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించగలరు.
– జోగు రామన్న, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్