ఎదులాపురం, సెప్టెంబర్ 9 : జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం వైభవంగా సాగింది. వెళ్లిరావయ్య గణపయ్య అంటూ భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. అందంగా అలంకరించిన వాహనాలపై గణపతులను నిమజ్జనానికి తరలించారు. యువత చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 9 : గణేశ్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లోని వినాయక చౌక్‌లో గల శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణేశ్ శోభాయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, హిందూ ఉత్సవ సమితి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
గణేశ్ నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు కేటాయించిన నంబర్ల ప్రకారం రోడ్లపైకి తీసుకువచ్చారు. నిమజ్జనోత్సవానికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలు చేపట్టారు. పట్టణంలోని వినాయక్ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు శోభాయత్రను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. పెన్‌గంగ వద్ద మున్సిపల్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.
బోథ్, సెప్టెంబర్ 9 : మండలంలోని సొనాల గ్రామంలో శ్రీరామ హిందూధర్మ జాగరణ వినాయక మండలి ఆధ్వర్యంలో గణనాథుడి శోభాయాత్ర నిర్వహించారు. సనాతన హిందూ సంప్రదాయాలను పాటిస్తూ నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో రామలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
నార్నూర్, సెప్టెంబర్ 9 : మండలంలోని నార్నూర్, రాజుల్‌గూడ, తాడిహత్నూర్ గ్రామాల్లో గణేశ్ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. బ్యాండ్‌మేళాలతో పాటు భజన మండలి ఆధ్వర్యంలో ప్రధానవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేశారు.
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 9 : మండల కేంద్రంతో పాటు ఎస్టీగోండ్గూడ, ప్రధాన్‌గూడ, మిలింద్‌నగర్, భీంనగర్, సాయినగర్, ముత్నూర్, దనోరా(బీ) గ్రామాల్లో గణేశ్ నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గణేశ్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు భక్తులతో కలిసి భోజనాలు చేశారు. ఇంద్రవెల్లి ఎస్ఐ సునీల్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, ఇంద్రవెల్లి గ్రామపటేల్ మారుతిపటేల్డోంగ్రే, నాయకులు తుకారాం, మారుతి, మరప రాజు, సుంకట్రావ్, కదం మహేశ్, కేశవ్పటేల్, నాగోరావ్, సంతోష్, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, సెప్టెంబర్ 9 : ఉట్నూర్‌లో నవరాత్రుల సందర్భంగా కొలువుదీరిన గణనాథులను నిమజ్జనానికి తరలించారు. వినాయక్ చౌక్ వద్ద చేరుకున్న గణనాథులు ఆకట్టుకున్నాయి. డప్పుచప్పుళ్లకు యువకులు, మహిళలు నృత్యాలు చేశారు. అనంతరం గణనాథులను పోచమ్మవాడ ద్వారా గంగన్నపేట చెరువులో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నాయకులు, ఉట్నూర్ సీఐ సైదారావు, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి రామారావు, నాయకులు గుగ్లావత్ శ్రీరాం నాయక్, మాజీ సర్పంచ్ బొంత ఆశారెడ్డి, మల్లేశ్, సభ్యులు రాజశేఖర్, బానోత్ సురేందర్, రవి, నగేశ్, గంగాధర్, శ్రీనాథ్, హరిప్రసాద్, రాథోడ్ సందీప్, సాయికృష్ణ, శ్రావణ్, శ్రీకాంత్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.