నార్నూర్, సెప్టెంబర్ 6 : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ కనక మోతుబాయి అన్నారు. మండలంలోని చోర్గావ్, సుంగపూర్, బాబేఝరి, ఖంపూర్ గ్రామాల్లో మంగళవారం కొత్తగా మంజూరైన పింఛన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 57 ఏళ్లకే వృద్ధులకు పింఛన్లు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్, సర్పంచ్‌లు ఆత్రం అనసూయబాయి, జాదవ్ యశోదబాయి, ఆనంద్‌రావ్, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమానికి పెద్దపీట
నార్నూర్, సెప్టెంబర్ 6 : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గాదిగూడ వైస్‌ఎంపీపీ మర్సివనే యోగేశ్ అన్నారు. గాదిగూడ మండలం మేడిగూడ, ఖడోడి, కోటపల్లి, రూపాపూర్ గ్రామాల్లో కొత్తగా మంజూరైన పింఛన్‌కార్డులను 80 మంది లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శోభ, మడావి జంగు, కోట్నాక్ జారు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.