సోన్, ఆగస్టు 25 : రానున్న రోజుల్లో కడ్తాల్ అయ్యప్ప ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోన్ మండలంలోని కడ్తాల్ అయ్యప్ప స్వామి ఆలయంలో మండప నిర్మాణానికి భూమిపూజ చేశారు. గ్రామంలో ఇప్పటివరకు అయ్యప్ప స్వామి ఆలయానికి రూ. 50లక్షలతో పాటు రామాలయానికి రూ. 28లక్షలు, పెద్దమ్మ ఆలయానికి రూ. 12లక్షలు, మహాలక్ష్మీ, భీమన్న ఆలయానికి రూ. 6.50 లక్షల చొప్పున, హనుమాన్ ఆలయానికి రూ. 5లక్షలు మంజూరు చేశామని వివరించారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణగౌడ్, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మొహినొద్దీన్, ఆలయ గురుస్వామి నర్సారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, కాంట్రాక్టర్ లక్కాడి జగన్మోహన్రెడ్డి, సర్పంచ్ బర్మ లక్ష్మీరాజనర్సయ్య, డైరెక్టర్ బర్మదాసు, ఉప సర్పంచ్ పుట్టి సాయేందర్, సోన్ సర్పంచ్ టీ వినోద్, నాయకులు సాయారెడ్డి పాల్గొన్నారు.