ఆదిలాబాద్ రూరల్, జూలై 24 : సంస్కృతీ సంప్రదాయాలకు తెలంగాణ సర్కారు పెద్ద పీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న వేడుకున్నారు. పట్టణంలో ఆదివారం బోనాల పండుగ పురస్కరించుకొని ఆదిత్యనగర్, సుభాష్ నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బోనమెత్తికొని ముందు నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకలు గ్రామదేవతలు అని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో సల్లగా చూడాలని మొక్కుకున్నట్లు ఆయన పేర్కొ న్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, పట్టణాధ్య క్షుడు అజయ్, కౌన్సిలర్లు జాదవ్ పవన్ నాయక్, లక్ష్మణ్, మహిళా విభాగం నాయకులు మమత, స్వరూపారాణి, నాయకులు పాల్గొన్నారు.
కిక్కిరిసిన ఆలయాలు..
పట్టణంలోని మహాలక్ష్మీవాడలోని మహాలక్ష్మీ ఆలయం, అశోక్రోడ్లోని పోచమ్మ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. పోచమ్మతల్లికి నైవేద్యాలు సమర్పించి తమ కుటుంబాలను సల్లగా ఉంచాలని వేడుకున్నారు. ఆలయ కమిటీల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఘనంగా దుర్గామాత జాతర
నిర్మల్ చైన్గేట్, జూలై 24 : నిర్మల్ పట్టణ శివారులోని నందిగుండం దుర్గామాత ఆలయం లో ఆదివారం బోనాల జాతర వైభవంగా జరిగిం ది. పట్టణంలోని పలు వీధుల గుండా మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధ్యక్షుడు లక్కాడి జగన్మోహన్రెడ్డి అమ్మ వారికి పట్టు వస్ర్తా లు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు నార్లపురం రవీందర్, ముత్యం సంతో ష్గుప్తా, పొలిశెట్టి విలాస్, కమిటీ సభ్యులు పూద రి నరహరి, వైసాయన్న, శివకుమార్, రాజ న్న తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆషాడ మాసం చివరి ఆదివారం సందర్భంగా నిర్మల్లోని మహా లక్ష్మి ఆలయం, శాంతినగర్లో అమ్మ వారికి మహిళలు బోనాలు సమర్పించారు.