ఆదిలాబాద్ రూరల్, జూలై 24 : కార్యకర్తల సంక్షేమం ఆలోచించే పార్టీ టీఆర్ఎస్సేనని ఆదిలా బాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. పట్టణంలోని సుభాష్‌నగర్‌లో ఆదివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కోరెడ్డి శంకర్, శ్రీనివాస్‌రెడ్డికి టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం పాటుప డుతున్నదని తెలిపారు. పల్లె, పట్టణం తేడా లేకుం డా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలను చూసి ఇతర పార్టీల నుంచి నాయకులు టీఆర్ఎస్లోకి తరలివస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణాధ్యక్షుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు.
స్వరాష్ట్రంలోనే అన్నివర్గాల అభివృద్ధి
ఎదులాపురం, జూలై 24 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రంలోనే అన్ని వర్గాల అభి వృద్ధి జరుగుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంఘం భవనంలో ఇటీవల ఎన్నికైన బొందిలి రాజ్‌పుత్ సమాజ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందు గా మహారాణా ప్రతాప్ చిత్రపటా నికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సంద ర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్ పుత్ సమాజ్ అభివృద్ధ్దికి తన వం తుగా పూర్తి సహకారం అంది స్తాన ని భరోసా కల్పించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత సర్కారు అన్ని కులాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. సంఘం సభ్యులు తన దృష్టికి తీసు కొచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. సంఘం అధ్యక్ష, కార్య దర్శులుగా ఎన్నికైన స్వదీప్ సింగ్, సత్య నారాయ ణతోపాటు యోగాలో రాణిస్తున్న ప్రజ్వల్ సింగ్‌ను శాలువాలతో సత్కరించారు. మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈర్ల సత్యనా రాయణ, ప్రధాన కార్యదర్శి కోరెడ్డి పార్థసారథి, బండారి దేవన్న తదితరులు ఉన్నారు.