బోథ్, జూలై 19 : ప్రజలు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ సూచించారు. మండల కేంద్రంతో పాటు పట్నాపూర్, కరత్వాడ గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. బోథ్‌లోని కాలనీల్లో పారిశుధ్య పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలతో రోడ్లపైకి వచ్చిన చెత్తను పారిశుధ్య కార్మికులు తొలగిస్తున్నారన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ప్లాస్టిక్ డబ్బాలు, డ్రమ్ముల్లో నీరు నిల్వ చేయడంతో దోమలు వృద్ధి చెంది జ్వరాలు ప్రబలుతాయన్నారు. ప్రతి ఐదు రోజులకోసారి వాటర్ క్లోరినేషన్ చేయాలని సూచించారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి జీవన్‌రెడ్డి, సర్పంచ్‌లు సురేందర్‌యాదవ్, సింధు, పంద్రం సుగుణ, ఈవో అంజయ్య, పంచాయతీ కార్యదర్శి మిథున్, ఏఎన్ఎంలు కవిత, సుమంగళ, ప్రధానోపాధ్యాయుడు చందన్, ఆశకార్యకర్తలు ఉన్నారు.
శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
నార్నూర్, జూలై 19 : పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని గాదిగూడ జడ్పీటీసీ మెస్రం గంగుబాయి అన్నారు. గాదిగూడ మండలం సావ్రి గ్రామ పంచాయతీ పరిధిలోని ఝరిలో పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి ఇంటింటికీ తిరిగి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. డ్రమ్ములు, డబ్బాలు, కుండల్లో నిల్వ ఉన్న నీటిని పారబోశారు. సీజనల్ వ్యాధుల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పంచాయతీ కార్యదర్శి సునీల్ వివరించారు. ఇక్కడ సర్పంచ్ కొడప మోతుబాయి, మాజీ సర్పంచ్ కొడప జాకు ఉన్నారు.
నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి
బోథ్, జూలై 19: ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సర్పంచ్ సురేందర్‌యాదవ్ సూచించారు. మండల కేంద్రంలోని పలు కాలనీల్లో ఆరోగ్య సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగారు. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు. కుండీలు, డ్రమ్ములు, టైర్లలో నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. కార్యక్రమంలో ఈవో అంజయ్య, ఏఎన్ఎం సుమంగళ, ఆశకార్యకర్త యశోద, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
బేల, జూలై 19 : పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఎంపీవో సమీర్హైమద్ అన్నారు. మండలంలోని డోప్టాల, శంషాబాద్, కాప్సి గ్రామాల్లో డ్రైడే నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి నిల్వ ఉన్న మురుగు నీటిని పారబోశారు. ఆయన వెంట సర్పంచ్ రాకేశ్, పంచాయతీ కార్యదర్శి జోగు ప్రణయా, ఆశ కార్యకర్త కవిత, ఐకేపీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు ఉన్నారు.
దివ్యాంగుల కాలనీలో డ్రై డే
ఎదులాపురం, జూలై 19 : దివ్యాంగుల కాలనీలో శాంతినగర్ యుపీహెచ్సీ ఆధ్వర్యంలో డ్రై డే నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ రాథోడ్ విజేశ్ , సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. నిల్వ ఉన్న నీరు పారబోశారు. అనంతరం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. అవసరమున్న వారికి మందులు అందజేశారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని పీహెచ్సీ, రిమ్స్‌లో వైద్యులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వార్డు ప్రత్యేకాధికారి సురేశ్, సీవో కేమరాజారెడ్డి, స్టాఫ్‌నర్సు లావణ్య, ఏఎన్ఎం, ఆశకార్యకర్తలు ఉన్నారు.
గ్రామాల్లో పారిశుధ్య పనులు
ఇంద్రవెల్లి, జూలై 19 : మండలంలోని కేస్లాపూర్, ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో గ్రామాల్లో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపడుతున్నారు. ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు వార్డులతో పాటు కేస్లాపూర్ పరిధిలోని కేస్లాగూడ పారిశుధ్య పనులు చేశారు. తడి, పొడి చెత్తను ట్రాక్టర్లో తరలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కోరెంగా గాంధారిసుంకట్రావ్, మెస్రం రేణుకానాగ్‌నాథ్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.