నిర్మల్ చైన్‌గేట్, జూలై 19 : ప్రాథమిక స్థాయి లోనే అన్ని రకాల వైద్యసేవలందించాలని జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్ పేర్కొన్నారు. జిల్లా వైద్యా ధికారి కార్యాలయంలో పల్లె దవాఖానల్లో పనిచే స్తున్న మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పల్లె దవాఖానలకు వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. కార్యక్ర మంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో రాజేందర్, ఎన్సీ డీ కార్యక్రమ నిర్వహణ అధికారి శ్రీనివాస్, ఆరోగ్య పర్యవేక్షకుడు విమల, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, వైద్యాధి కారులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
దిలావర్పూర్, జూలై 19 : సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా వైద్యాధి కారి ధన్‌రాజ్ పేర్కొన్నారు. సిర్గాపూర్ గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. వరుస వర్షాలు, ముసురు వల్ల గ్రామాల్లో పారిశుధ్య సమస్య ఏర్ప డి అనారోగ్య సమస్యలు ఉత్పన్న మవుతు న్నా యన్నారు. మలేరియా, డెంగీ జ్వరాలు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నందున పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట డాక్టర్ శ్యాంకుమార్, డాక్టర్ రాజేందర్, సర్పంచ్ గంగారెడ్డి తదితరులున్నారు.
అవగాహన కల్పించాలి
సోన్, జూలై 19 : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధి కారి ధన్‌రాజ్ సూచించారు. నిర్మల్ మండలం తాంశ గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రాజేందర్, వైద్యాధికారులు శ్యామ్‌కుమార్, సౌమ్య, తదితరులున్నారు.