సారంగాపూర్, జూలై 9 : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ధని గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త పాకాల వెంకటరమణ మూడు నెలల కిందట విద్యుదాఘాతంతో మృతిచెందగా పార్టీ తరఫున మంజూరైన రూ.2లక్షల బీమా చెక్కును మంత్రి శనివారం నిర్మల్ పట్టణంలోని తన నివాసంలో వెంకటరమణ భార్య గంగామణికి అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్‌రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, మార్కెట్ చైర్మన్ వంగ రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, ఎంపీటీసీ శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ రాజు, నాయకులు రాజ్‌మహ్మద్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, చిన్నయ్య పాల్గొన్నారు.
సోన్, జులై 9 : సోన్ మండలంలోని సోన్, కడ్తాల్, సిద్ధులకుంట, లోకల్ వెల్మల్ గ్రామాలకు చెందిన పలు కుటుంబాలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం తన నివాసంలో అందించారు. కార్యక్రమంలో సోన్ టీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, పీఏసీఎస్ డైరెక్టర్ బర్మదాసు తదితరులున్నారు.