
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 4: జిల్లాలో గణేశ్ ఉత్సవాలను ప ర్యావరణ హితంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర అటవీ, ప ర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్లోని ఎమెల్యే క్యాంపు కార్యాలయంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి శనివారం శ్రీకారం చుట్టారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…రసాయనాలతో తయారు చేసిన ప్రతిమలతో వాతావరణ, నీటి కాలుష్యం సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. పర్యావరణంపై అవగాహన పెంచేందుకే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలను తయారు చేసి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రకృతితో సహజీవనం చేస్తూ మందుకు సాగితేనే మానవ మనుగడకు సార్థకత ఉంటుందని పేర్కొన్నారు.
కాలుష్య ని యంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్మల్ నియోజకవర్గంలో 12 వేల మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. నిర్మల్ పట్టణంలో 3వేల విగ్రహాలు, మం డల కేంద్రాల్లో 9 వేల విగ్రహాలు పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. ఉత్సవాల నిర్వహణపై ఈనెల 9న శాంతి కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదా ముత్యం రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేంద ర్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్ రావు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు అయ్యన్నగారి రాజేందర్, గండ్రత్ రమణ, ఎస్పీ రాజు, నాయకులు ముడుసు సత్యనారాయణ,అడ్ప పోశెట్టి తదితరులున్నారు.
మంత్రిని కలిసిన డీపీఆర్వో..
జిల్లా పౌరసంబంధాల అధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన ఉమారాణి శనివారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. మంత్రికి పూల మొక్కను అందజేశారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పాల్గొన్నారు.
వైద్యులు సేవాభావం కలిగి ఉండాలి
ప్రైవేట్ వైద్యులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సీజల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులను దృష్టిలో ఉంచుకొని నిర్మల్ పట్టణానికి చెందిన తిరుమల దవాఖాన వైద్యుడు రమేశ్ రెడ్డి ఆధ్వర్యం లో శనివారం విశ్వనాథ్పేట్లో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రమేశ్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమా లను అభినందించారు. ఈ మెడికల్ క్యాంపులో 500మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా నెలకు సరిపడా మందులు అందించారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదా ముత్యం రెడ్డి, వైస్ చైర్మన్ సాజిద్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, పట్టణాధ్యక్షడు మారుగొండ రాము, వేణుగోపాల కృష్ణ, సుభా ష్ రా వు, ముడుసు సత్యనారాయణ తదితరులున్నారు. అనంత రం విశ్వనాథ్ పేట్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని మంత్రి ప్రారంభించారు.