దిలావర్పూర్, జూన్ 27 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉం డాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. నిర్మల్-భైంసా 61వ జాతీయ రహదారి పక్కన మండలంలోని న్యూ లోలం గ్రామం వద్ద మొక్కలు నాటే ప్రదేశాన్ని సోమవారం ఆయ న పరిశీలించినారు. అనంతరం అక్కడికి వచ్చిన మండల స్థాయి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. మొక్కల పండుగ ప్రారంభమ య్యే నాటికి గ్రామాల్లో, రహదారి పక్కన గుంతలు సిద్ధం చేసి ఉంచాలని సూచించారు. ఇందుకోసం ఉపాధి హామీ కూలీలను వినియోగించుకోవాలని కోరారు. గ్రామంలో రోడ్ల వెంట అందమై న పూల మొక్కలు నాటించాలని తెలిపారు.
ఈ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జాతీయ రహదారి పక్కన నాటే మొక్కలకు తప్పనిసరిగా ఇనుప కంచెలతో కూడిన జాలీలు ఏర్పాటు చేయాలని, అందుకు పంచాయతీ నిధులు వెచ్చించాలని ఆదేశించారు. గతంలో నాటిన మొక్కలు ఎక్కడైనా ఎండిపోతే వాటి స్థానంలో కొత్తవి నాటించాలని తెలిపారు. జా యింట్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజీజ్‌ఖాన్, తహసీల్దార్ కరీం, ఆర్ఐ సంతోష్, పంచాయతీ కార్యదర్శి సునీల్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
నిర్మల్ టౌన్, జూన్ 27 : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభా గం నిర్వహించారు. జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వచ్చిన అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 24 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించా రు. అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడే, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.