ఖానాపూర్ టౌన్, మే 31: సీఎం కేసీఆర్ వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఖానాపూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచన మేరకు డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని సూచించారు. వానకాలం సాగుకు రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవడానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఖానాపూర్ పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, సత్తనపెల్లి పీఏసీఎస్ చైర్మన్ అమంద శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ చైర్మన్ గంగాధర్, ఏవో ఆసం రవి, ఏఈవో రాకేశ్, సీఈవో ఆశన్న, నాయకులు కేహెచ్ ఖాన్, పుప్పాల గజేందర్, రామిడి మహేశ్, పెద్ది మల్లేశ్, పత్రి నగేశ్, శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు, జీలుగ విత్తనాల పంపిణీ
మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవాకేంద్రంలో ఎమ్మెల్యే రేఖానాయక్ రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం రమ్యానాయక్కు రూ.20వేలు, నిఖిలకు రూ.30వేలు, ప్రకాశ్‌కు రూ.40వేలు, పోశవ్వకు రూ.12వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కు లు మంజూరు కాగా లబ్ధిదారులకు అందజేశారు. ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, ఎంపీపీ భూక్యా కవిత, వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సల్లా నరేందర్‌రెడ్డి, ఏడీఏ సు జాత, ఏవో రవి, సర్పంచులు పూర్ణచందర్‌గౌడ్, సుధాకర్, సుదర్శన్, మహేందర్, సూర్యభాను, రాజు, ఎంపీటీసీ రామారావు పాల్గొన్నారు.