ఎదులాపురం, మే 24 : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం మేస్త్రీ యూనియన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులు పడుతున్న ఇబ్బందులను గ్రహించి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపా రు. మేస్త్రీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.30 లక్షలు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతి కార్మికుడు జీవిత బీమా చేయిం చుకోవాలని సూచించారు. అనంతరం భవన నిర్మాణ సంఘం నాయకులు ఎమ్మెల్యేకు పుష్పగు చ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కో ఆప్షన్ సభ్యుడు హేజాజ్, బాల శంకర్ కృష్ణ, ఆదిలాబాద్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎస్కే హైమద్, ఉపాధ్య క్షుడు పెంటాజి, కార్యదర్శులు నగేశ్, ఎస్కే సలీ మ్, రమేశ్, పొచ్చన్న, లక్ష్మణ్, రాజన్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆధ్మాతికతతోనే మానసిక ప్రశాంతత
ఆధ్మాతికతతోనే మానసిక ప్రశాంతత ఉంటుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలా బాద్ రూరల్ మండలం చిట్ట్యాలబోరిలో హను మాన్ మందిరానికి గుడిగోపురం ఆవిష్కరించా రు. హనుమంతుడికి వెండి కిరీటం ధారణ చేశా రు. అనంతరం హోమం నిర్వహంచారు. ఎంపీపీ లక్ష్మీజగదీశ్, వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, సర్పం చ్ కుమ్ర లక్ష్మీబాయి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ప్రతి నెలా సమావేశాలు నిర్వహించాలి
విద్యా కమిటీ సభ్యులు పాఠశాలలో ప్రతి నెలా సమావేశాలు విధిగా నిర్వ హించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలం తారోడ(బీ), నిరాల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరోడా పాఠశాలకు రూ.15లక్షలు, నిరాల పాఠశాలకు రూ.28లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ గోవర్ధన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమల వెంకట్ రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, పీఏపీఎస్ చైర్మన్లు గోవర్ధన్ రెడ్డి, పురుషోత్తం, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు చంద్రయ్య, నాయ కులు గజనాథ్, ప్రభాకర్, ఎంపీడీవో గజనాథ్ రావు, హెచ్ఎంలు సంజీవ్‌రెడ్డి, నర్సయ్య, పాల్గొ న్నారు. నిరాలలోని భీమ్సేన్ ఆలయంలో ఎమ్మె ల్యే ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పర్దాన్ సమాజ్ డివిజన్ అధ్యక్షుడు గంగారాం, నాయకులు పంద్రె గంగాప్రసాద్, చందు, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.