సోన్, మే 22 : స్వరాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని, ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఆలయాల నిర్మాణం చేపడుతున్నదని రాష్ట్ర అట వీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ మండలం అక్కాపూర్‌లో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయంలో ఆదివారం నిర్వహించిన విగ్రహా ప్రతిష్ఠాపనోత్సవానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఆలయాల నిర్మాణాలను పూర్తి చేశామని చెప్పారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి 27వ ప్యాకేజీ ద్వారా అన్ని చెరువులను నింపి పంటలు పండించుకునేందుకు సాగు నీరు అందిస్తున్నామని పేర్కొన్నారు.
చెరువుల్లో నీరు నింపడం ద్వారా చేప పిల్లలను వదిలి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. రూ. 5 లక్షలతో పోచమ్మ ఆలయం నిర్మించామని, మరో రూ. 12లక్షలు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. అనంతరం అన్నదాన నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్య తరలివచ్చారు. ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ ధర్మారం సుజాత పోశెట్టి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మద, ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఎంపీటీసీ బోండ్ల శ్రీవాణి, నాయకులు సలీం, గంగారెడ్డి, వీడీసీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అడెల్లి ఆలయంలో మంత్రి పూజలు
సారంగాపూర్, మే 22: మండలంలోని అడెల్లి పోచమ్మ ఆలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజారి శ్రీనివాస్ శర్మ మంత్రితో పూజలు చేయించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ రవీందర్‌రెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, సర్పంచ్‌లు, ఎం పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నక్షత్ర హోటల్ ప్రారంభం
నిర్మల్ అర్బన్, మే 22 : జిల్లా ఏరాటుతో నిర్మల్‌లో వ్యాపార, వాణిజ్య రంగం దినదినా భివృద్ధి చెందుతుందని మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని శాంతినగర్ క్రాస్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నక్షత్ర హోటల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు న మ్మకం కలిగేలా సేవలు అందించినప్పుడే వ్యాపా రం అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా అభి వృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. అనంతరం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్‌ను నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీకాంత్, మేడారం అపర్ణ, నాయకులు కోటగిరి అశోక్, మేడారం ప్రదీప్, అల్లోల సురేందర్ రెడ్డి హోటల్ నిర్వాహకుడు కిషోర్ తదితరులున్నారు.