ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 26 : పేదప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని ఎంపీపీ లక్ష్మీజగదీశ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం కచ్కంటి, యాపల్‌గూడ, రాములుగూడ, బుర్నూ ర్, మత్తడిగూడ, శివఘాట్, న్యూరాంపూర్, రామాయి గ్రామాల్లో శనివారం ఇంటింటికీ తిరుగుతూ 21 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ లక్ష్మీజగదీశ్ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులపై భారపడవద్దని ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకల కింద ఆర్థిక సాయం అందజేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ సోనేరావ్, ఎంపీటీసీలు గంగాధర్, కిషన్, జంగుబాపు, సర్పంచ్‌లు గంగారం, రతన్, విఠల్, నాయకులు ఆరె నరేశ్, రమణ, గంగయ్య, మధు పాల్గొన్నారు.