నిర్మల్ అర్బన్/నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 23: సేవాలాల్ మందిర నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలో నిర్వహించనున్న సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు. మందిర నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసినందుకు మంత్రిని ఘనంగా సన్మానించారు.ఇక్కడ భూక్య రమేశ్, తుకారాం, జనార్దన్ నాయక్, బలరాం నాయక్, జాదవ్ వెంకట్రావు, అశోక్ నాయక్, రాజేందర్, భీంరావు, గోవింద్ ఉన్నారు.
దర్జీ సంఘం రాష్ట్ర భవనానికి తెలంగాణ ప్రభు త్వం రూ.కోటి నిధులను మంజూరు చేసినందుకు గానూ బుధవారం మేరు సంఘ సభ్యులు మంత్రిని కలిసి ఘనంగా సన్మానించారు. నిర్మల్ పట్టణ దర్జీ సంఘ భవనానికి అదనపు నిధులు ఇవ్వాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, రాజుల శ్రీనివాస్, రాజేశ్వర్, అంజయ్య, దయా సాగర్, నవీన్ కుమార్, రాజశేఖర్, అరవింద్, మురళీధర్, శివకుమార్ ఉన్నారు.