జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్
బేలలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
బేల, మార్చి 30 : పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం 17 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటివన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు వట్టిపెల్లి ఇంద్రశేఖర్, పార్టీ మండలాధ్యక్షుడు ప్రమోద్‌రెడ్డి, నాయకులు తన్వీర్ ఖాన్, విపిన్ ఖోడే, సంతోష్ బెదూడ్కర్ , భూమన్న, రాందాస్, తహసీల్దార్ బడాల రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
బేల, మార్చి 30 : మండల కేంద్రానికి చెందిన మార్పెల్లి శంకర్‌కు రూ.60 వేలు, కొగ్దూర్ గ్రామానికి చెందిన మంగేశ్‌కు రూ.60వేలు సీఎం సహాయనిధి కింద మంజూరయ్యాయి. బేలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ వారి కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.