బోథ్, మార్చ్ 26 : మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శనివారం ఉపాధ్యాయులకు మండల స్థాయిలో నిర్వహించిన టీఎల్ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) వర్క్‌షాప్ ఆకట్టుకుంది. ఐదు స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలోని ఉపాధ్యాయులు వివిధ బోధన పద్ధతులను సూచిస్తూ చార్టులు తయారు చేశారు. విద్యార్థులకు చూసి నేర్చుకునేందుకు వీలుగా, సులభంగా అర్థయ్యేరీతిలో చార్టులు తయారు చేసి ప్రదర్శించారు. తయారీపై రిసోర్స్పర్సన్లు అప్పాల శ్రీనివాస్‌రెడ్డి, సంగు స్వామి సూచనలు అందించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి అన్రెడ్డి భూమారెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కిషన్, పోశెట్టి, రాంరెడ్డి, గంగయ్య, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.
నేరడిగొండ, మార్చి 26 : ఉపాధ్యాయులు తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించడానికి టీఎల్ఎం మేళా ఉపయోగపడుతుందని డీఆర్పీ రవికుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీలో శనివారం టీఎల్ఎం మేళా నిర్వహించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎంలు శ్రీనివాస్‌గౌడ్, శ్యాంరావ్, శ్రీనివాస్, మండల కోఆర్డినేటర్ రాం అనిల్, సీఆర్పీలు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
టీఎల్‌ఎంతో విద్యార్థులకు ఉపయోగం
జైనథ్, మార్చి 26: టీఎల్ఎం మేళాతో విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఎంఈవో నారాయణ అన్నారు. మండల కేంద్రంలో ఉపాధ్యాయులచే తెలుగు, గణితం పాఠ్యపుస్తకాలకు సంబంధించినటీఎల్ఎం వర్క్‌షాప్ నిర్వహించి మేళా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎల్ఎం వర్క్‌షాప్ ద్వారా ఉపాధ్యాయులకు వినూత్నరీతిలో బోధనకు ఎంతగానో ఉపయోగత్మకంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎంలు సూర్యకాంత్, లస్మన్న, వెంకటరమణ, రిసోర్స్ పర్సన్ బాబన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మేడిగూడలో..
మేడిగూడ కెనాల్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయులతో తెలుగు, గణితం పాఠ్యపుస్తకాలకు చెందిన టీఎల్ఎం వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం లక్ష్మారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.