మంచిర్యాల ఏసీపీ సాధన రష్మీ పెరుమాళ్
గర్మిళ్ల, మార్చి 25: వాహనదారులు నిబంధనలు పాటించాలని మంచిర్యాల ఏసీపీ సాధన రష్మీ పెరుమాళ్ సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో మంచిర్యాల ఏసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించారు. నంబర్ ప్లేట్ లేని టూ వీలర్ వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ వాహనదారులు తప్పని సరిగా నిబంధనలు పాటించాలన్నారు. ఈ డ్రైవ్‌లో పట్టణ సీఐ బీ నారాయణ నాయక్, ఎస్ఐలు తైహిసొద్దీన్, గంగారాం, ఏఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వ్యసనాలకు బానిస కావద్దు
హాజీపూర్, మార్చి 25 : యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దు అని మంచిర్యాల ఏసీపీ ఎస్ రష్మీ పెరుమాళ్ అన్నారు. మండలంలోని వెంపల్లిలో హాజీపూర్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ మీకోసం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని కొందరు ముందుకు సాగుతుండగా మరికొంత మంది సెల్ఫోన్లు, మద్యం, డ్రగ్స్‌కు అలవాటై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. అనంతరం వాలీబాల్ కిట్లు అందజేశారు.
చెన్నూర్ పట్టణంలో..
చెన్నూర్, మార్చి 25: చెన్నూర్ పట్టణంలో శుక్రవారం వాహనాలను సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. వాహనాలపై ఉన్న పెండింగ్ చాలన్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వరకు చలాన్లు చెల్లించిన వారికి రాయితీలను ఇచ్చిందని తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐలు చంద్రశేఖర్, వెంకట్, పోలీసులు పాల్గొన్నారు.
ఇందారం క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీ
జైపూర్, మార్చి 25: జైపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇందారం క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. కార్ల అద్దాలకు బ్లాక్ స్టిక్కర్ వేసి ఉంటే తొలగించారు. ఈ తనిఖీల్లో శ్రీరాంపూర్ సీఐ బీ రాజు, జైపూర్ ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది ఉన్నారు
హాజీపూర్ మండలంలో..
హాజీపూర్, మార్చి 25 : మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ ఉదయ్ కిరణ్‌తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
నస్పూర్‌లో..
సీసీసీ నస్పూర్, మార్చి 25: వాహనదారులు తప్పకుండా నిబంధనలు పాటించాలని సీఐ తోట సంజీవ్, సీసీసీ నస్పూర్ ఎస్ఐ శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం సీసీసీ కార్నర్ వద్ద వాహనాల తనిఖీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
భీమారం మండలంలో..
భీమారం, మార్చి 25 : భీమారం మండల కేంద్రంలో బస్టాండ్ , ఆవుడం క్రాస్ రోడ్డు సమీపంలో బారికెడ్లను ఆర్ఎంపీల సహకారంతో ఏర్పాటు చేశామని శ్రీరాంపూర్ సీఐ రాజు తెలిపారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలని, లైసెన్స్, తదితర పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీవో శ్రీపతి బాపు , భీమారం సర్పంచ్ గద్దెరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.