దస్తురాబాద్,మార్చి6 :పల్లెలను హరితవనాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీకో ఒక్కటి నర్సరీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మొక్కల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో ఎండ తీవ్రతను మొక్కలు తట్టుకునేందుకు వీలు గా గ్రీన్ నెట్లను ఏర్పాటు చేశారు. ఉపాధి హమీ పథకం ద్వారా మండలంలోని ప్రతి పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేశారు. 13 వేల చొప్పున మొక్కలను పెంచుతున్నారు. రానున్న హరితహారానికి మండ లంలో 1.39 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరగడంతో ఎండలు మండి పోతున్నాయి. మొక్కలు వాడి పోకుండా నిత్యం నీళ్లు అందిస్తున్నారు. ఎండలు పెరుగుతున్నందున వాటిని సంరక్షించేందుకు పంచాయతీ సిబ్బంది నర్సరీలపై గ్రీన్ నెట్లు ఏర్పా టు చేస్తున్నారు. వీటి ద్వారా మొక్కలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
1.39 లక్షల మొక్కల పెంపకం…
ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా బుట్టాపూర్, మున్యాల, మల్లాపూర్,దస్తురాబాద్,దేవునిగూడెం, ఆకొండపేట, భూత్కూర్, గొడిసెర్యాల్ తదితర పంచాయతీల్లో మొత్తం 1.39 లక్షల మొక్కలు పెంచుతున్నారు. లక్ష్యం మేరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు పెంచేందుకు ప్రణాళికను రూపొందించారు. ప్రతి పంచాయతీలలో 13 వేల చొప్పున మొక్కలు పెంచుతున్నారు.
మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
హరితహారం మొక్కల సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాం. నర్సరీలో మొక్కలు ఎండి పోకుండా షేడ్ నెట్లను ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు పరిలీస్తూ రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. రానున్న 8 విడుత హరితహారం కార్యక్రమం కోసం మొక్కలను సిద్ధం చేస్తు న్నాం. మొక్కలకు ఈ గ్రీన్ షేడ్ నెట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఎంత తీవ్రతన నేరుగా మొక్కలపై పడకుండా కాపాడుతాయి. మొక్కలకు చల్లదనాన్ని సమకూర్చడంలో రక్షణగా ఉంటాయి.
-రవి ప్రసాద్, ఏపీవో,దస్తురాబాద్