ఇచ్చోడ, మార్చి 12 : బోథ్ నియోజక వర్గంలోని కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు వేయనున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తెలిపారు. ఎమ్మెల్యే బాపురావ్ జన్మదినం సందర్భంగా ఇచ్చోడలోని విఠల్ రెడ్డి గార్డెన్లో టీఆర్ఎస్ నాయకులు శనివారం ఘనం గా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నియోజక వర్గంలోని పార్టీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండలాల కన్వీనర్లు, ఆత్మ చైర్మన్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, పీఏసీఎస్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గజమాలలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కుప్టి ప్రాజెక్టు నిర్మాణంతో రైతుల కష్టాలు దూ రం కానున్నాయన్నారు. ఏడేళ్లలో బోథ్ నియోజక వర్గంలో చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతం ధమ్మరెడ్డి, సర్పంచ్ చౌహాన్ సునీత, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు గాడ్గె సుభాష్, మాజీ ఎంపీపీ డుకురే సుభాష్ పాటిల్, నాయకులు, మేరాజ్ అహ్మద్, లోక శిరీశ్ రెడ్డి, దాసరి భాస్కర్, వెంకటేశ్, రాథోడ్ ప్రవీణ్ కుమార్, భీముడు, గ్యాతం గంగయ్య, గైకాంబ్లే గణేశ్, గుండాల శ్రీకాంత్, బల్గం రవి కుమార్, ఆర్గుల గణేశ్, కుంట సురేందర్ రెడ్డి, గుండాల కన్నమయ్య, అబ్దుల్ రషీద్, లతీఫ్, గోనే లక్ష్మి, అనసూయ, నియోజక వర్గంలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.