పెండ్లి రోజే దంపతుల దుర్మరణం
పూజ ముగించుకొని వస్తుండగా ప్రమాదం
అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు
భార్యాభర్తలిద్దరు మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్
శోకసంద్రంలో జన్నారం మండలం మరిమడుగు గ్రామస్తులు
జన్నారం, మార్చి 9 : పెండ్లిరోజే భార్యాభర్తలు మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి సమీపంలోని అటవీ శాఖ చెక్పోస్ట్ సమీపంలో జరిగింది. లక్షెట్టిపేట సీఐ కరీముల్లాఖాన్, ఎస్ఐ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మురిమడుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ శోభారాణి (60), మాజీ సర్పంచ్ మురళీధర్ రెడి ్డ(65) పెండ్లి రోజు కావడంతో బుధవారం ఉదయం ఇందన్పల్లి సమీపంలోని హనుమాన్ ఆలయానికి వెళ్లారు. పూజలు చేసిన అనంతరం తిరిగి కారులో ఇంటికి బయలుదేరారు. ఇందన్పల్లి సమీపంలోని అటవీ శాఖ చెక్పోస్ట్ సమీపంలోకి చేరుకోగానే అదుపుతప్పి ప్రధాన రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. భార్యాభర్తలు ఒకేరోజు మృతి చెందడంతో కుటుంబ సభ్యు లు శోకసంద్రంలో మునిగిపోయారు.