సీఎం కేసీఆర్ ప్రకటనతో బోథ్ నియోజకవర్గ వ్యాప్తంగా సంబురాలు
బోథ్, మార్చి 9 : నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ శాసనసభలో ఉద్యోగ నియామక ప్రకటన చేయడాన్ని హర్షిస్తూ బోథ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు, నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు సంబురాలు నిర్వహించారు. బోథ్‌లో ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ రుక్మాణ్‌సింగ్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ లింబాజీ, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ ప్రశాంత్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, సర్పంచ్ సురేందర్‌యాదవ్, నాయకులు ప్రవీణ్, సత్యనారాయణ, రాజు, జగన్మోహన్రెడ్డి, ప్రశాంత్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ముక్రా (కే)లో..
ఇచ్చోడ, మార్చి 9 : ముక్రా(కే) గ్రామంలో యువకులు బ్యాండ్ వాయిస్తూ ర్యాలీ తీశారు. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సర్పంచ్ మీనాక్షి, యువకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుభాష్, ఉపసర్పంచ్ వర్షతాయి, నాయకులు సంజీవ్, తిరుపతి, దీపక్, బాలాజీ, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ, మార్చి 9: మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ముస్తాఫా, నాయకులు దాసరి భాస్కర్, రాథోడ్ ప్రవీణ్ కుమార్, గణేశ్, భీముడు, విఠల్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్‌లో..
గుడిహత్నూర్, మార్చి 9 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో నాయకులు పటాకులు కాల్చారు. బస్టాండ్ ప్రక్కన అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు శగీర్ఖాన్, న్యాను, నాయకులు జాదవ్ రమేశ్, భీంరావ్, జంగు, సోయం సతీశ్, దిలీప్, గ్రామ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
జీవితాంతం రుణపడి ఉంటాం
గుడిహత్నూర్, మార్చి 9 : ఉద్యోగ క్రమబద్ధీకరణ స్వప్నాన్ని నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని కాంట్రాక్టు అధ్యాపకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకులు శ్రీనివాస్, రత్నాకర్, లావణ్య పాల్గొన్నారు.
భీంపూర్‌లో..
భీంపూర్, మార్చి 9 : మండల కేంద్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్, వైస్‌ఎంపీపీ గడ్డం లస్మన్న, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అనిల్, సర్పంచ్‌లు మడావి లింబాజీ , పెండెపు కృష్ణయాదవ్, నాయకులు బొంత నితిన్, మేకల నాగయ్య, నరేందర్‌యాదవ్, పురుషోత్తం, గోవర్ధన్‌యాదవ్ పాల్గొన్నారు.
సిరికొండలో..
సిరికొండ, మార్చి 9 : ఉద్యోగాల భర్తీపై శాసనసభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను హర్షిస్తూ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, నిరుద్యోగులు, యువకులు పటాకులు కాలుస్తూ సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ బాలాజీ, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అశోక్, నాయకులు బషీర్, రాజన్న, ఈశ్వర్, రాములు, దత్తు, గంగాధర్, శంకర్ పాల్గొన్నారు.
నేరడిగొండలో..
నేరడిగొండ, మార్చి 9: అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పడంపై మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జడ్పీటీసీ జాదవ్ అనిల్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చారు. టీఆర్ఎస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ శివారెడ్డి, ఏఎంసీ చైర్మన్ భోజన్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బజార్హత్నూర్లో..
బజార్హత్నూర్, మార్చి 9 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు, నిరుద్యోగ యువకులు పటాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం, నాయకులు చంద్రశేఖర్, చట్ల విలాస్, రమేశ్, ప్రభు, భాస్కర్‌రెడ్డి, సాయన్న, జాంసింగ్, పోతన్న, సాయిచైతన్య, తదితరులు పాల్గొన్నారు.
తాంసిలో..
తాంసి, మార్చి 9 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాజు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రమణ, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కంది గోవర్ధన్‌రెడ్డి, సర్పంచ్ శంకర్, ఎంపీటీసీలు అశోక్, రఘు, మాజీ ఎంపీటీసీ గంగారాం, నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో…
తమను రెగ్యూలర్ చేస్తామని సీఎం ప్రకటన చేయడంపై తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్టు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకులు సంతోష్, దేవేందర్, శశికుమార్, రమణారెడ్డి, మల్లేశ్, అనుపమ, స్రవంతి పాల్గొన్నారు.