జన్నారం, డిసెంబర్ 6 : కవ్వాల్ టైగర్ రిజర్వుడ్ అడవుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నాగ్‌పూర్‌కు చెందిన పెంచ్ టైగర్ రిజర్వుడ్‌కు చెందిన 11మంది అధికారుల బృందం జన్నారం రేంజ్‌లోని గోండుగూడ అడవుల్లో మంగళవారం పర్యటించారు. ఈ పనుల వివరాలపై రేంజ్ ఆఫీసర్ హఫీసొద్దీన్ అవగాహన కల్పించారు. వన్యప్రాణుల గుర్తింపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వాటి రక్షణకోసం ఏర్పాటు చేసిన గడ్డి క్షేత్రాలు, నీటికుంటలు, చెరువులు, సోలార్ విద్యుత్ మోటర్లు, ఏర్పాటు చేసిన కుంటలపై వివరించారు. ఈ కార్యక్రమంలో నాగ్‌పూర్‌కు చెందిన ఇద్దరు రేంజ్ ఆఫీసర్లు, ఇద్దరు రౌడ్ ఆఫీసర్లు, ఏడుగురు ఎఫ్‌బీవోలు పాల్గొన్నారు.
ఐజీఎఫ్ అధికారి పరిశీలన
బెజ్జూర్, డిసెంబర్ 6 : అటవీ ప్రాంతాల్లో కంపా నిధులతో చేపట్టిన పనులను తెలంగాణ రాష్ట్ర ఐజీఎఫ్ (ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్) అధికారి మంజునాథ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలోని అటవీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం విడుదల చేసిన కంపా నిధులతో కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని ఆయా అటవీ ప్రాంతాల్లో చేపట్టిన చెక్‌డ్యాంలు, ప్లాంటేషన్లు, నర్సరీలు, తాత్కాలిక రోడ్ల పనులను పరిశీలించామన్నారు. ఇందులో భాగంగా సిర్పూర్ రేంజ్ పరిధిలోని ఇటిక్యాల పహాడ్‌లో ప్లాంటేషన్, బెజ్జూర్ రేంజ్లో నర్సరీలను పరిశీలించి పనులు బాగున్నాయని కితాబిచ్చారు. మండలంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు బెజ్జూర్ – సోమిని రోడ్డుతో పాటు మొగవెళ్లి గూడెం రోడ్లకు అటవీ అనుమతులు లేక ఇబ్బందులవుతున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. మొదటి విడుత అనుమతులు లభించాయని, జాతీయ వన్యప్రాణుల బోర్డు నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. త్వరలో వాటి అనమతులు రాగానే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. జిల్లాలో పలు రోడ్లకు ప్రతిపాదనలు పంపించి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఆయన వెంట ఆసిఫాబాద్ డీఎఫ్‌వో దినేశ్, ఎఫ్‌డీవో విజయ్‌కుమార్, రేంజ్ అధికారులు దయాకర్, వేణుగోపాల్, సెక్షన్ అధికారి ప్రసాద్ రావు, సిబ్బంది ఉన్నారు.