కోటపల్లి, నవంబర్ 29 : అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని మంచిర్యాల జిల్లా స్థానిక సంస్థల అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ స్పష్టం చేశారు. కోటపల్లి మండలంలోని షట్పల్లి, సర్వాయిపేట గ్రామపంచాయతీలో అదనపు కలెక్టర్ రాహుల్ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. షట్పల్లి గ్రామపంచాయతీలో ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ పనులను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో అమలవుతున్న కార్యక్రమాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. గ్రామపంచాయతీ, ఉపాధిహామీ రికార్డులను పరిశీలించారు. రికార్డులను సక్రమంగా ఉంచాలని సూచించారు. గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి పల్లె ప్రకృతి వనాన్ని మరింత ఆకర్షనీయంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి రోజూ చెత్తను సేకరించాలని, తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసి డంప్ యార్డులలో ఎరువు తయారు చేయాలని సూచించారు.
ప్లాస్టిక్ వేస్టేజ్‌ను విక్రయించి గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూర్చాలన్నారు. అనంతరం సర్వాయిపేట ప్రాథమిక పాఠశాలను సందర్శించి అభివృద్ధి పనులు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి పలు ప్రశ్నలను అడిగి జవాబులను రాబట్టారు. అనంతరం నర్సరీని పరిశీలించి పలు సూచనలు చేశారు. గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్ పంచాయతీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, ప్రతి రోజూ గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. స్టాండింగ్ కమిటీలను గ్రామ పంచాయతీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని గ్రామసభలకు గ్రామస్తులు హాజరయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే భాస్కర్, ఎంపీవో అక్తర్ మోహియొద్దీన్, పీఆర్ ఏఈ రాజ శేఖర్, ఏపీవో వెంకటేశ్వర్లు, షట్పల్లి సర్పంచ్ ముల్కల్ల ఉమ, ఉప సర్పంచ్ గోనె మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు శంకర్, రాజ శేఖర్, ఈసీ నాగేందర్, టీఏలు మధూకర్, సంపత్ రెడ్డి తదితరులున్నారు.