ఇంద్రవెల్లి, నవంబర్ 19 : పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్ అన్నారు. ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛతా రన్ ర్యాలీ తీశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు శుభ్రతను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఎంపీడీవో పుష్పలత, సర్పంచ్ కోరెంగా గాంధారి, ఉపసర్పంచ్ గణేశ్, జడ్పీ పాఠశాల చైర్మన్ కాంబ్లే బాపురావ్, పంచాయతీ ఈవో సంజీవ్‌రావ్, నాయకులు దేవ్‌పూజే మారుతి, షేక్ సుఫియాన్, పోటే సాయినాథ్, శివాజీ, శ్రీనివాస్, సుంకట్రావ్, తదితరులు పాల్గొన్నారు.
బోథ్, నవంబర్ 19: మండల కేంద్రంలో సర్పంచ్ సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్వచ్ఛతా రన్ ర్యాలీ తీశారు. పంచాయతీ కార్యాలయం నుంచి పలు వీధుల గుండా ర్యాలీ చేపట్టారు. స్వచ్ఛత గురించి ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉట్నూర్, నవంబర్ 19 : ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో జడ్పీటీసీ చారులత, ఎంపీడీవో తిరుమల ఆధ్వర్యంలో స్వచ్ఛతా రన్ ర్యాలీ తీశారు. ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల వాడకం, పరిసరాలు పరిశుభ్రం గురించి, తడి, పొడి చెత్త వేరు చేసే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ ఈవో శంకర్, కార్మికులు మనోహర్, ప్రదీప్, అంజి పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 19 : ఆదిలాబాద్ మండలం వాన్వాట్, మామిడిగూడ, తంతోలి గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో విద్యార్థులు స్వచ్ఛతా రన్ ర్యాలీ తీశారు. ఇంటి పరిసర ప్రాంతంలో నీరు నిల్వ ఉంచకూడదని, వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించుకొని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ తూర్పాబాయి యాదవ్రావ్, మడావి లక్ష్మీబాయి, పంచాయతీ కార్యదర్శులు షబీర్, చైతన్య, మహేశ్, స్మైల్ సొసైటీ అధ్యక్షుడు కేమ శ్రీకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, నవంబర్ 19 : ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని వినియోగించాలని ఎంపీపీ ప్రీతమ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు ముక్రా(కే), దాబా, మల్యాల, సిరిచెల్మ గ్రామాల్లో స్వచ్ఛతా రన్ ర్యాలీ నిర్వహించారు. ముక్రా(కే)లో సర్పంచ్ గాడ్గె మీనాక్షి ఆధ్వర్యంలో అన్ని విధులు ఊడిచారు. మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, ఎంఈవో రాథోడ్ ఉదయ్‌రావ్, పంచాయతీ సీఈవో సూర్యప్రకాశ్, ఉపసర్పంచ్ శిరీష్ రెడ్డి పాల్గొన్నారు.
ఇచ్చోడ(సిరికొండ), నవంబర్ 19 : సిరికొండతో పాటు సుంకిడి, రాయిగూడ, పున్నసోంపల్లి, కన్నాపూర్, కుంటగూడ, మల్లాపూర్ గ్రామాల్లో విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛతా రన్ ర్యాలీ తీశారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి వినియోగించాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ అనిత, పంచాయతీ కార్యదర్శి అరుణ్, ఏపీవో అతుల్ పాల్గొన్నారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
బేల, నవంబర్ 19 : ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని జైనథ్ ఎంపీపీ గోవర్ధన్ అన్నారు. జైనథ్‌లో స్వచ్ఛతా రన్ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఎంపీడీవో గజానన్‌రావ్, ఎంపీవో వెంకటరాజు, సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీ సుదర్శన్, నాయకులు గణేశ్‌యాదవ్, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు , విద్యార్థులు పాల్గొన్నారు.
తాంసి, నవంబర్ 19 : మండలంలోని కప్పర్ల, బండలనాగాపూర్, పొన్నారి, సవర్గాం, అంబుగాం గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో స్వచ్ఛతా రన్ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సదానందం, కృష్ణ, భరత్, యశ్వంత్, సంజీవ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శలు స్వప్న, విజయలక్ష్మి, అనిత, అమిద్, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.