బోథ్, నవంబర్ 12 : ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన 8వ రాష్ట్రస్థాయి బాలికల గురుకులాల క్రీడా పోటీ లు శనివారం అట్టహాసంగా ముగిశాయి. కాళేశ్వ రం, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి జోన్ల పరిధిలోని 18 జిల్లాల్లోని 86 సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలకు చెందిన 1176 మంది విద్యార్థినులు పోటీల్లో పాల్గొన్నారు.
వ్యక్తి గత చాంపియన్‌షిప్‌లో అండర్-14 విభాగంలో పీ నిక్షిత, అండర్-17లో ఎం రుచిత, అండర్-19లో జే నవ్య, ఓవరాల్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో అండర్-14లో జోన్-4ఏ (భద్రాద్రి), అండర్-17లో జోన్-37ఏ (రాజన్న సిరిసిల్ల), అండర్-19లో జోన్-4బీ (భద్రాద్రి), ఓవరాల్ టీం చాంపియన్సిప్లో అండర్-14లో జోన్-4బీ (భద్రాద్రి జోన్), అండర్-17లో జోన్-4బీ (భద్రాద్రి జోన్), అండర్-19లో జోన్-4బీ (భద్రాద్రి) గురుకులాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
స్పోర్ట్ మీట్‌కు ఓవరాల్ అధికారి సట్ల శంకర్, ఆదిలాబాద్ ఆర్సీవో కొప్పుల స్వరూపారాణి, స్థానిక ప్రిన్సిపాల్ స్వర్ణలత, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచి ర్యాల జిల్లాల కోఆర్డినేటర్లు ఎస్ శ్రీనివాస్, పోలో జు బాలరాజు, రామాల భాస్కర్, ప్రిన్సిపాళ్లు ప్రేమరాణి, ఐనాల సైదులు, సంధ్య, శ్రీనాథ్, సంతోష్, లలితకుమారి, వినోద్ కమిటీల ఇన్ చార్జిలుగా వ్యవహరించారు. సీనియర్ పీడీలు శ్రీదేవి, సంధ్య, అనూష, నాన్సి క్రీడాపోటీలు నిర్వహించారు.
అండర్-14 విభాగంలో దుగ్గొండి గురుకుల పాఠశాలకు చెందిన పెనక నిక్షిత అథ్లెటిక్స్ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు గెలుచుకొని ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. అండర్-17 విభాగం లో చిన్నబోనాల గురుకులానికి చెందిన మామిం డ్ల రుచిత మూడు బంగారు పతకాలు కైవసం చేసుకొని ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. అండర్-19 విభాగంలో అథ్లెటిక్స్ పోటీల్లో మూడు బంగారు పతకాలు కైవసం చేసుకున్న టేకులపల్లి గురుకులానికి చెందిన జొన్నల గడ్డ నవ్య వ్యక్తిగత ఓవరాల్ చాంపియన్‌గా అవత రించింది.
విజేతలకు అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బహుమతులు అందజేశారు. గెలుపొందిన విద్యా ర్థినులను అభినందించారు. సర్పంచ్ సురేందర్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల కన్వీనర్ రుక్మాణ్‌సింగ్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.