65 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ టీఆర్ఎస్
దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు..
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 28 : భారతీయ జన తా పార్టీ(బీజేపీ) చిల్లర రాజకీయాలు మానుకోవాలని, మత రాజకీయాలకు మనుగడ లేదని, ఉ త్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓటర్లు ఓట్లు వేయకపోతే బు ల్డోజర్లతో తొక్కిస్తానడం బాధాకరమైన విషయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపా రు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, అభివృద్ధి, సంక్షేమమే తమ పార్టీ ఎజెండా అని పేర్కొన్నారు. ఇది జీర్ణించుకోలేని కొందరు నాయకులు పిచ్చిమాటలు మాట్లాడుతున్నారన్నా రు. కాంగ్రెస్ పార్టీ నేత టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం సిగ్గు చేటని ఏడు నియోజకవర్గాల మీటింగ్ పెడితే కనీసం 1000 మంది కార్యకర్తలు కూడా లేరని అన్నారు. పటిష్ట సభ్యత్వమున్న పార్టీ టీఆర్ఎస్ అని, 65 లక్షల మంది సభ్యత్వం ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్ర జలు కోరుకుంటున్నారని, అమెరికా వంటి భారతదేశాన్ని నిర్మించడం కేసీఆర్‌తోనే సాధ్యమన్నా రు. ఈ సమావేశంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు నేరెళ్ల వేణు, గండ్రత్ రమణ, బిట్లింగ్ నవీన్, సోన్ జడ్పీటీసీ జీవన్ రెడ్డి, దేవరకోట ఆలయ చైర్మన్ లక్ష్మీనర్సయ్య, సీనియర్ నాయకులు ముడుసు సత్యనారాయణ, నాయకులు ఉన్నారు.