లోకేశ్వరం, ఆగస్టు 20 : మండలంలోని కనకా పూర్ ఎత్తిపోతల పథకం ఆదర్శంగా నిలుస్తున్న ది. దీన్ని మోడల్ ఎత్తిపోతల పథకంగా గుర్తించా రు. గత నెలలో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతిని ధులు ఈ పథకం, కమిటీ పనితీరును అధ్యయ నం చేశారు. మండలంలోని కనకాపూర్, అబ్దుల్లా పూర్, జోహర్పూర్, అర్లి గొడిసెరా, రాయపూర్ కాండ్లి, రాజేశ్ తండా, చింతకుంట తండా గ్రామా ల్లోని 4780 ఎకరాలకు సాగు నీరందించాలన్న ఉద్దేశంతో రూ. 22 కోట్ల 55 లక్షల 40 వేలతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 2009 లో ఈ పథకాన్ని ప్రారంభించారు. రెండో మెన్ డీసీలు, 170 సబ్ డీసీలను నిర్మించారు.
వీటి ద్వారా రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నారు. పనులు పూర్తికాగానే బ్రహ్మేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అని నమోదు చేసుకున్న కమిటీకి అప్పగించారు. దీని నిర్వాహ ణ బాధ్యతలు అప్పటి నుంచి కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఎలాంటి ఇబ్బం దుల్లేకుండా బీడు భూములను సస్యశ్యామలం చేసుకుంటు న్నారు. ఏ పంట సాగు చేసినా ఎకరాకు రూ. 1200లు నీటి వసతి కింద వసూలు చేస్తున్నట్లు చైర్మన్ క్యామ ముత్యం తెలిపారు.
పంపుల ఆపరేటింగ్, నీటి తడులు ఇచ్చేందుకు నలుగురు ఆపరేటర్లు, ఇద్దరు వాచ్మెన్లను నియమించారు. వారికి నెల నెల వేతనం కింద రూ. 80 వేలు, కార్యాలయ ఖర్చు కింద నెలకు రూ. 20 వేలు, లిఫ్ట్ మరమ్మతులకు రూ. 2 లక్షల యాభై వేలు ఖర్చు చేస్తున్నారు.
ఈ మొత్తాన్ని పథకం ఆదాయం నుంచే ఖర్చు చేస్తున్నారు. కమిటీలో ఆరుగురు డైరెక్టర్లు ఉన్నారు. ప్రతీ మూడు నెలల కోసారి సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చిస్తారు. పూర్తిస్థాయిలో పైప్ లైన్ పనులు పూర్తికాకపోవడంతో వర్షాకాలంలో 2200 యాసంగిలో 1800 ఎకరాలకు నీరంది స్తున్నామని చైర్మన్ పేర్కొన్నారు.