దులాపురం, ఆగస్టు 4: తల్లిపాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యకరమని, పుట్టిన వెంటనే పిల్లలకు ముర్రుపాలు తాగించాలని ఐసీడీఎస్ సర్కిల్ సూపర్వైజర్ ఫర్హా అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం రిమ్స్‌లో బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు పట్టించాలన్నారు. శిశువుకు తల్లిపాలు తాగించడంతో వ్యాధినిరోధక శక్తి పెరుగుతూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు గీత, స్వరూప, అంగన్వాడీ కార్యకర్త రాధ, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, ఆగస్టు 4 : శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానమని ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి పేర్కొన్నారు. మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది ర్యాలీ తీశారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణుల, బాలింతలకు ముర్రుపాలు విశిష్టతపై అవగాహన కల్పి ంచారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నేరడిగొండ, ఆగస్టు 4 : తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని పీహెచ్సీ డాక్టర్ లావణ్య అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీ ఆవరణలో తల్లిపాల ప్రాధాన్యతను ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆగస్టు మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారన్నారు. పిల్లలకు తల్లిపాలు ఇవ్వకుంటే అనారోగ్యానికి గురవుతారని తెలిపారు. అనంతరం తల్లిపాల వారోత్సవాల కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో హరికుమార్‌గౌడ్, హెల్త్ సూపర్వైజర్ రాంనరేశ్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఆగస్టు 4 : పుట్టిన బిడ్డకు తల్లి ముర్రుపాలు పట్టించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీల అన్నారు. మండలంలోని ధనోరా(బీ) గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఇందిరమ్మ, మహిళలు కమల, మమత, గర్భిణులు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.